Breaking News

మళ్లీ నటించడానికి సిద్ధం!

Published on Mon, 06/24/2024 - 10:51

బాలీవుడ్‌ లెజెండ్రీ దిలీప్‌కుమార్‌ కుటుంబానికి చెందిన నటి సాయేషాసైగల్‌. టాలీవుడ్‌ యువ నటుడు అఖిల్‌ కథానాయకుడిగా నటించిన అఖిల్‌ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన నటి సాయేషా సైగల్‌. ఆ తర్వాత అజయ్‌దేవగన్‌ సరసన శివాయ్‌ చిత్రంతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా జయంరవికి జంటగా వనమగన్‌ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయ్యారు. ఈ చిత్రంతో నటిగానే కాకుండా తనలో మంచి డాన్సర్‌ ఉన్నట్లు నిరూపించుకున్నారు. 

ఆ తర్వాత తమిళంలో కార్తీ సరసన కడైకుట్టి సింగం, విజయ్‌సేతుపతితో జూంగా, ఆర్యకు జంటగా గజినీకాంత్, రెడీ, సూర్య సరసన కాప్పాన్‌ చిత్రాల్లో కథానాయకిగా నటించారు. అలాంటి సమయంలో ఆర్యను ప్రేమించి పెద్దల అనుమతితో 2019లో పెళ్లిచేసుకున్నారు. దీంతో నటనకు చిన్నగ్యాప్‌ ఇచ్చారు. ఈ సినీజంటకు హర్యానా అనే కూతురు పుట్టింది. 

కాగా చిన్నగ్యాప్‌ తర్వాత సాయేషా శింబు కథానాయకుడిగా నటించిన పత్తుతల చిత్రంలో ఒక సింగిల్‌సాంగ్‌లో మెరిశారు. ప్రస్తుతం మళ్లీ నటించడానికి సిద్ధమైనట్లు తెలిసింది. పలు కథలు వింటున్నారని సమాచారం. దీంతో సాయేషా మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నారన్న వార్త ఆమె అభిమానుల్లో ఆనందాన్ని ఇస్తోంది. దీంతో త్వరలోనే సాయేషాసైగల్‌ రీఎంట్రీ షురూ అవుతుందని భావించవచ్చు. అయితే ఆమె తాజాగా ఏ నటుడి సరసన నటిస్తారన్నదే ఆసక్తిగా మారింది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)