Breaking News

‘జీబ్రా’ క్లైమాక్స్‌ వరకు ఆ విషయం తెలియదు: సత్యదేవ్‌

Published on Thu, 11/21/2024 - 17:41

‘ఇప్పుడు బ్యాంక్ వ్యవస్థ  అంతా డిజిటల్ అయ్యింది. అక్కడ క్రైమ్ చేయడం అంత ఈజీ కాదు. బ్యాంక్ లో పని చేసే వాళ్లకి తప్పితే సామాన్యులకు అక్కడ జరిగే తప్పులు తెలియవు. దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ గతంలో బ్యాంక్ లో పని చేశారు. ఆయన చూసిన ఇన్సిడెంట్స్ తో పాటు ఇంకొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ తో  ‘జీబ్రా’ సినిమాను తెరకెక్కించాడు. ఏటీఎం లో డబ్బులు తీసినప్పుడు ఓ సౌండ్ తో డబ్బులు బయటికి వస్తాయి. ఆ సౌండ్ వెనుక ఏం జరుగుతుందనేదే ఈ సినిమా. కామన్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అన్నారు హీరో సత్యదేవ్‌. కన్నడ స్టార్‌ హీరో డాలీ ధనంజయ హైలీ, సత్యదేవ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌, జెన్నిఫర్‌ పిషినాటో హీరోయిన్లుగా నటించారు. నవంబర్‌ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సత్యదేవ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

జీబ్రా..బ్లాక్ అండ్ వైట్ కి మెటాఫర్. బ్లాక్ మనీ, వైట్ మనీ చుట్టూ జరిగే కథ ఇది. అలాగే చివరి వరకూ ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలీదు. ప్రతిఒక్కరిలో గ్రే ఉంటుంది. అందుకే టైటిల్ ఫాంట్ కి గ్రే పెట్టి, సినిమాకి జీబ్రా అనే టైటిల్ పెట్టారు. నాకు స్క్రిప్ట్ పంపినప్పుడే అదే టైటిల్ తో వచ్చింది. అలాగే నాలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. అన్ని రకాలుగా జీబ్రా టైటిల్ యాప్ట్.

→ ఈ కథ విన్నప్పుడు మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది. ఇంత గొప్ప కథ మనదగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలని విన్నపుడే ఫిక్స్ అయ్యాను. సినిమా రిలీజైన తర్వాత ఆయన రైటింగ్, డైరెక్షన్ కి చాలా మంచి పేరు వస్తుంది.

→ ఇందులో నేను బ్యాంకర్‌ని. ధనుంజయ గ్యాంగ్ స్టర్.. మా రెండు ప్రపంచాలు ఎలా కలిశాయనేది చాలా ఆసక్తికరంగా  ఉంటుంది. పుష్పలో జాలీ రెడ్డి పాత్ర తనకి  మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో గ్యాంగ్ స్టర్ పాత్రలో చాలా మంచి శ్వాగ్ ఉంటుంది. కంప్లీట్ డిఫరెంట్ గాచేశాడు. ఈ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులు ఇంకా దగ్గరవుతాడు. సినిమా కన్నడ లో కూడా రిలీజ్ అవుతుంది, అక్కడ తనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ కూడా సినిమా బాగా ఆడుతుంది.

→ నాకు కామన్ మ్యాన్ రోల్స్ ఇష్టం. ఇందులో ఆ కామన్ మ్యాన్ కనెక్ట్ నచ్చింది. ఇందులో లుక్ మారుస్తున్నాను. బ్యాంకర్ రోల్ ఇప్పటివరకూ చేయలేదు. అది ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇప్పటివరకూ దాదాపు సీరియస్ రోల్స్ చేశాను. దాన్ని బ్రేక్ చేద్దామని దర్శకుడు ఈశ్వర్ కూడా భావించారు. ఇందులో చాలా కొత్త సత్యదేవ్ ని చూస్తారు. కామన్ మ్యాన్ విన్ అనేది అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్.

→ ప్రస్తుతం 'ఫుల్ బాటిల్' అనే సినిమా చేస్తున్నాను. అది  అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిల్మ్. వెంకటేష్ మహా తో ఓ సినిమా ఉంటుంది. చాలా గ్రేట్ స్టొరీ కుదిరింది.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)