Breaking News

ఇంటికి వెళ్లి పొలం పనులు చేసుకుంటా కానీ.. : సత్యదేవ్‌

Published on Sun, 08/03/2025 - 13:34

సత్యదేవ్‌.. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు సహాయ నటుడి పాత్రలతో కూడా అలరిస్తున్నాడు. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్‌ సినిమాలో సత్యదేవ్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా ఇటీవల విడుదలైన మంచి టాక్‌ని సంపాదించుకుంది. విజయ్‌ తో పాటు సత్యదేవ్‌ పోషించిన పాత్రకు కూడా మంచి స్పందన లభిస్తోంది. సత్యదేవ్‌ కూడా ఈ సినిమాలో ఒక హీరోనే అని చాలా మంది అంటున్నారు. 

హీరో అన్నయ్య శివ పాత్రలో ఆయన ఫెర్ఫార్మెన్స్‌ అద్బుతంగా ఉందని చెబుతున్నారు.  పాత్ర నచ్చడంతోనే ఆ సినిమాకు ఒప్పుకున్నానని అంటున్నాడు సత్యదేవ్‌.  ఈ సినిమా కంటే ముందు చాలా సినిమాల్లో సహాయ నటుడి పాత్రలు వచ్చాయి కానీ నచ్చకపోవడంతో నో చెప్పానని అన్నారు.  డబ్బుల కోసం ఎప్పుడు సినిమాలు చేయనని.. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే.. ఇంటికి వెళ్లి పొలం పనులు చేసుకుంటానని సత్యదేవ్‌ అంటున్నాను. 

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘డబ్బు కోసం అయితే నేను సినిమాలు చేయలేను. గాడ్‌ ఫాదర్‌ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. అలాంటి పాత్రలు చేయమని చాలా మంది అడిగారు. కానీ  పాత్ర నచ్చక చేయలేదు. ఫైనాన్షియల్‌ ప్రాబ్లమ్స్‌ వచ్చినా నేను డబ్బు కోసం సినిమా చేయలేదు. మంచి పాత్రల కోసం ఎదురు చూశా. అందుకే ఇప్పుడు శివ లాంటి పాత్రలు దొరికాయి.  డబ్బు కోసం సినిమా చేయొద్దని స్ట్రాంగ్‌గా ఫిక్సయ్యాను. ఒకవేళ డబ్బులే కావాలనుకుంటే ఇంటికి వెళ్లి పొలం పనులు చేసుకుంటాను. అంతేకాని నచ్చని పాత్రలు అయితే చేయను’ అని సత్యదేవ్‌ అన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)