Breaking News

‘బాక్సాఫీస్‌పై ‘సర్కారు వారి పాట’ దండయాత్ర

Published on Tue, 05/17/2022 - 13:56

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా, ‘గీత గోవిందం’ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 12 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రం.. బాక్సాపీస్‌ వద్ద చరిత్ర సృష్టిస్తోంది.

(చదవండి: ‘సర్కారు వారి పాట’ చూసిన సితార పాప రియాక్షన్‌ ఏంటంటే..)

కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.160.2 కోట్ల గ్రాస్‌,  రూ. 100.44 కోట్ల షేర్‌ని సాధించి, రికార్డు క్రియేట్‌ చేసింది. ఐదు రోజుల్లో రూ.100కోట్ల షేర్‌ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రమిది. నైజాం ఏరియాల్లో ఈ చిత్రం 31.47 కోట్ల వసూళ్లను రాబట్టింది. నైజాంలో 30కోట్లకు పైగా వసూళ్ల సాధించిన మూడో చిత్రమిది. ఈ చిత్రానికి దాదాపు రూ.120 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే.. మరో 20 కోట్ల రూపాయలను వసూలు చేయాల్సి ఉంది. ఇదే స్పీడ్‌ కొనసాగితే మరో మూడు, నాలుగు రోజుల్లోనే ‘సర్కారు వారి పాట’ బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

సర్కారు వారి పాట ఐదు  రోజులు కలెక్షన్స్‌ వివరాలు

► నైజాం - రూ.31.47 కోట్లు

► సీడెడ్ - రూ.10.44 కోట్లు

► ఈస్ట్ - రూ.7.05కోట్లు

► వెస్ట్ - రూ.4.65కోట్లు

► ఉత్త‌రాంధ్ర - రూ.10.25 కోట్లు

► గుంటూరు- రూ.7.85కోట్లు

► కృష్ణా - రూ.5.76కోట్లు 

► నెల్లూరు - రూ.3.12 కోట్లు

► కర్ణాటక, రెస్టాఫ్‌ ఇండియా- 7.75 కోట్లు

►ఓవర్సీస్‌-12.1 కోట్లు

►మొత్తం 100.44 కోట్లు(షేర్‌)

Videos

ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB

కాళ్లకు రాడ్డులు వేశారన్న వినకుండా.. కన్నీరు పెట్టుకున్న తెనాలి పోలీసు బాధితుల తల్లిదండ్రులు

ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి.. నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

దీపికాపై సందీప్ రెడ్డి వంగా వైల్డ్ ఫైర్

ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ

తెనాలి పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)