ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
ప్రతి సీన్‌కి చప్పట్లు కొడుతున్నారు: వరలక్ష్మి
Published on Mon, 03/09/2026 - 01:29
‘‘సరస్వతి’ కేవలం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కాదు. థ్రిల్లర్, యాక్షన్, ఎమోషన్, లవ్... అన్నీ ఉన్నాయి. ఈ చిత్రం బాగుందని చాలామంది మెసేజ్‌లు పంపారు. ‘సరస్వతి’ లాంటి మంచి సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది. మీ ప్రేమకి ధన్యవాదాలు’’ అని వరలక్ష్మీ శరత్‌కుమార్ చెప్పారు. ఆమె లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘సరస్వతి’. పూజా శరత్ కుమార్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 6న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో వరలక్ష్మీ శరత్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘మా మూవీ ప్రదర్శితమవుతున్న చాలా థియేటర్స్‌కి వెళ్లాను.
ప్రతి సీన్‌కి, డైలాగ్స్‌కి ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. క్లైమాక్స్ చూసి చాలా సర్ర్పైజ్ అయ్యారు’’ అని పేర్కొన్నారు. పూజా శరత్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా చూసిన ప్రేక్షకులు అద్భుతమైన స్పందనని కనబరిచారు. ఈ మూవీని థియేటర్స్‌లోనే చూడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘సరస్వతి’ లాంటి సినిమాలు తీయాలన్నా, ఇలాంటి కథ చెప్పాలన్నా ధైర్యం కావాలి. ఒక సినిమా మనసుని కదిలిస్తే అది సక్సెస్ అయినట్లే. ‘సరస్వతి’ అలా మనసుల్ని కదిలించిన సినిమా’’ అని వరలక్ష్మి భర్త నికోలాయ్ సచ్దేవ్ పేర్కొన్నారు.
Tags : 1