Breaking News

ఆ సీన్‌ గురించి తప్పుడు ప్రచారం.. చాలా బాధ పడ్డాను: నటి శరణ్య

Published on Sun, 03/10/2024 - 12:30

శరణ్య ప్రదీప్ తెలంగాణ యువతి .. చిన్న చిన్న పాత్రలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ఆర్టిస్ట్. తెలంగాణ యాస మాట్లాడటంలో ఆమె కంటూ ఒక స్టైల్ ఉంది .. అందువలన పల్లె పాత్రలలో ఆమె ఇట్టే ఒదిగిపోతుంది. ఫిదా సినిమాతో శరణ్యకు మంచి గుర్తింపు దక్కింది. తాజాగా సుహాస్‌కు అక్కగా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'లో తన నటనతో విశ్వరూపాన్ని చూపింది. ఈ సినిమాలో సుహాస్‌ను పూర్తిగా శరణ్య ప్రదీప్ డామినేట్ చేసింది. నిజంగానే శరణ్య సినిమా మొత్తానికి ఆమెనే హీరోలా అనిపించేలా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో విలన్ ఆమెను బట్టలు తొలగించి ఓ స్కూళ్లో బంధించి వెళ్లినప్పుడు గానీ… పోలీస్ స్టేషన్‌లో విలన్‌ను కాలితో తన్నిన సీన్‌లో గానీ శరణ్య విజృంభించేసింది.

శరణ్యతో పాటుగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో పుష్ప ఫేమ్‌ జగదీశ్‌ కూడా నటించాడు. ఈ చిత్రంలో శరణ్యకు ప్రియుడి పాత్రలో ఆయన నటించిన విషయం తెలిసిందే. ఒక యువతిని ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమె ఆత్మహత్యకి కారణం అయ్యాడనే ఆరోపణలతో  జగదీశ్‌ జైలుకు వెళ్లి ఆపై బెయిల్‌పై వచ్చాడు. ఈ అంశం గురించి శరణ్య తాజాగా ఇలా రియాక్ట్‌ అయింది.

'జగదీస్‌ కేసులో ఏం జరిగిందో నాకు తెలియదు. అలాంటి సమయంలో మాట్లాడడం కరెక్ట్ కాదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా  రేంజ్‌లో గుర్తింపు పొందిన జగదీశ్ ఇలాంటి కేసులో చిక్కుకోవడం బాధాకరం. అయితే మా సినిమా సెట్‌లో మాత్రం జగదీశ్  అందరితో చాలా బాగా ఉండేవాడు. నాతో పాటు అందరినీ కూడా చాలా గౌరవంగా పలకరించేవాడు. నాకు తెలిసినంత వరకు  అతడి క్యారెక్టర్‌లో ఎలాంటి తేడా లేదు. కానీ ఆయన కేసు విషయంలో ఏం జరిగిందో మనం చూడలేదు కాబట్టి దాని గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు.' అని శరణ్య పేర్కొంది. 

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో ఆమెను వివస్త్రను చేసిన సీన్‌ గురించి ఆమె ఇప్పటికే పంచుకుంది. తన భర్త సపోర్ట్‌ ద్వారా మాత్రమే ఆ సీన్‌ చేయగలిగానని చెప్పింది. కానీ కొంతమంది యూట్యూబ్‌ వారు తప్పుడు థంబ్‌నైల్స్‌ పెట్టి మరో రకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. సినిమాలో ఎం లేకపోయినా కూడా ఎదో ఉంది అనేలా క్రియేట్‌ చేసి వీడియోలు పోస్ట్‌ చేశారు. దీంతో చాలా వీడియోలకు స్ట్రైక్స్‌ కొట్టినా ఉపయోగం లేదని శరణ్య వాపోయింది. వాస్తవంగా ఆ సీన్‌లో ఎలాంటి అసభ్యత లేదు. ఆ సీన్‌లో నటించాలంటే గట్స్‌ ఉండాలి. కానీ శరణ్య ఎంతో ధైర్యంగా ఒప్పుకుని ఆ సీన్‌లో మెప్పించింది. దీంతో తన సినీ కెరియర్‌లో మరో పది మెట్లు ఎక్కేలా చేసింది. ఏదేమైనా సరైన కథ,దర్శకుడి చేతిలో శరణ్య పడితే మరోసారి తన నటనతో దుమ్మురేపడం ఖాయం అని చెప్పవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)