అది నాకు బోనస్‌: సంతోష్‌ శోభన్‌

Published on Sun, 05/14/2023 - 05:51

‘‘గోల్కొండ హైస్కూల్‌’ (2011) చిత్రంలో చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించాను. ఈ సినిమాలోని నా పెర్ఫార్మెన్స్‌ నాకు చాలా అవకాశాలు తెచ్చిపెడుతుందనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసినా దాదాపు నాలుగేళ్లు నాకు అవకాశాలు దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన అవకాశాలు, కొన్ని కథలు కరెక్ట్‌ అని భావించి కొన్ని సినిమాలు చేశాను. అవి వర్కౌట్‌ కాలేదు. ఇక నా కెరీర్‌ పరంగా ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం మంచి బిగ్‌స్క్రీన్‌ మూవీగా నిలుస్తుందని భావిస్తున్నాను’’ అని అన్నారు సంతోష్‌ శోభన్‌.

నందినీ రెడ్డి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్, మాళవికా నాయర్‌ జంటగా నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. స్వప్నామూవీస్, మిత్రవిందా మూవీస్‌తో కలిసి ప్రియాంకా దత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో రిషి పాత్రలో కనిపిస్తాను. ‘అలా..మొదలైంది’ చూసి నందినీరెడ్డిగారితో ఓ సినిమా చేయాలనుకున్నాను.

అలాగే ఓ యాక్టర్‌గా నాకు తొలి అడ్వాన్స్‌ చెక్‌ ఇచ్చింది ప్రియాంకా దత్‌గారు. ఇలా.. వీరి కాంబినేషన్స్‌తో నా కెరీర్‌కు కావాల్సిన టైమ్‌లో ‘అన్నీ మంచి..’ లాంటి సినిమా వస్తుండటం లక్‌గా భావిస్తున్నాను. ఇక ఈ సినిమా అవుట్‌పుట్‌ బాగా రావడం నాకు బోనస్‌’’ అన్నారు.   నేడు మదర్స్‌ డేని పురస్కరించుకుని శోభన్‌ మాట్లాడుతూ – ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లవుతోంది. నటుడిగా నాకు అవకాశాలు తగ్గినప్పుడు అమ్మ నమ్మకమే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతోనే నేను సినిమాలు చేస్తున్నాను. మాకు సొంత ఇల్లు లేదు. త్వరలోనే మా అమ్మకు సొంత ఇంటిని గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)