Breaking News

ఆస్కార్‌ వరకూ వెళ్లిన సంతోష్‌ రిలీజ్‌కి బ్రేక్‌

Published on Sun, 03/30/2025 - 02:41

యూకే తరఫున ఆస్కార్‌ నామినేషన్‌ ఎంట్రీ పోటీకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చిన ‘సంతోష్‌’ చిత్రం విడుదలకు భారత్‌లో బ్రేక్‌ పడిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సహానా గోస్వామి, సునీతా రాజ్వర్, సంజయ్‌ బిష్ణోయ్, కుశాల్‌ దూబే ప్రధానపాత్రల్లో భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్‌ ΄పౌరురాలు సంధ్యా సూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంతోష్‌’. 2024లో అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో యూకే తరఫున ఆస్కార్‌కు అధికారికంగా ఎంట్రీ ఇచ్చిన ‘సంతోష్‌’ మూవీ డిసెంబర్‌లో షార్ట్‌ లిస్ట్‌ అయినప్పటికీ అవార్డు అందుకోలేకపోయింది.

ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో ఇండియాలో విడుదల చేయాలనుకున్నప్పటికీ కుదరలేదు. ఈ మూవీలో పలు సున్నితమైన అంశాలను చూపించడంపై సెన్సార్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిందని యూనిట్‌ తాజాగా వెల్లడించింది. అందుకే ఈ సినిమాని భారత్‌లో రిలీజ్‌  చేయడం లేదని పేర్కొంది. ఈ విషయం గురించి సంధ్యా సూరి మాట్లాడుతూ– ‘‘సంతోష్‌’ని భారత్‌లో విడుదల చేయాలని ప్రయత్నించాం. మా చిత్రంలో కొన్ని సున్నితమైన సన్నివేశాలను తొలగించమని సెన్సార్‌ బోర్డు పేర్కొంది. అలా చేస్తే మా కథలోని గాఢత పోతుంది.

స్క్రిప్ట్‌ దశలో ఉన్నప్పుడు మా సినిమాని అందరూ అంగీకరించారు. కానీ, ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైగా మా సినిమాలో చూపించిన సన్నివేశాలను, సమస్యలను గతంలో ఎన్నో సినిమాల్లో ప్రస్తావించారు. బహుశా మా సినిమాలో హీరో లేకపోవడం వల్ల నచ్చలేదేమో? అందుకే మా సినిమాని ఇండియాలో థియేటర్స్‌లో రిలీజ్‌ చేయడం లేదు. ఇది మాకెంతో బాధగా ఉంది’’ అని తెలిపారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)