Breaking News

కోలీవుడ్‌ స్టార్స్‌ సంక్రాంతి సెలబ్రేషన్స్‌

Published on Sat, 01/17/2026 - 11:02

సంక్రాంతి వచ్చిందంటే ఆనందాల సందళ్లు తెచ్చినట్లే. ప్రతి ఇంటా సంబరాలు వెల్లి విరుస్తాయి. పేద ,గొప్ప అన్న తేడా లేకుండా తమకు తోచిన విధంగా అందరూ సంక్రాంతి పండగను జరుపుకుంటారు. రంగవళ్లుల లోగిళ్లు, పిండివంటల ఘుమఘుమలు, ఆత్మీయుల నవ్వుల పలకరింతలు, అనుబంధాలు, అనురాగాలతో, సంతోషాలతో ఆనందంగా గడుపుతారు. 

పొంగల్‌ వేడుక
పల్లెటూరల్లో అయితే ఈ వేడుకల మోత మోగుతుంది. కోడిపందేలు, ఎద్దుల పోటీలు, ఇంకా కాయ్‌ రాజా కాయ్‌ అంటూ అనేక క్రీడలు ఆడతారు. సినిమా వాళ్ల విషయానికి వస్తే సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో ఆడంబరంగా, ఆనందంగా జరుపుకుంటారు. అదే విధంగా కోలీవుడ్‌లో మన తారలు పొంగల్‌ వేడుకను భక్తిశ్రద్ధలతో వేడుకగా సెలబ్రేట్‌ చేసుకుంటారు.

ఫ్యామిలీతో రజనీకాంత్‌
అలా రజనీకాంత్‌ నుంచి దర్శకుడు మారిసెల్వరాజ్‌ వరకు పలువురు పొంగల్‌ సంబరాలు చేసుకున్నారు. రజనీకాంత్‌ తన కుటుంబ సభ్యులతో పొంగల్‌ వేడుకలను జరుపుకున్నారు. అనంతరం తనను కలవడానికి వచ్చిన అభిమానులను సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి వారి కళ్లలో ఆనందాన్ని నింపారు. ఈ పండగ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

సెలబ్రిటీల సంక్రాంతి
హీరోయిన్‌ నయనతార ఈ పొంగల్‌ వేడుకలను తన భర్త ,దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌, ఇద్దరు పిల్లలతో కలిసి విశేషంగా జరుపుకున్నారు. పిండివంటలు, రకరకాల తీపి పదార్థాలు, పళ్లు, చెరుకు గడలు ఏర్పాటు చేసి, పాలు పొంగించారు. హీరో కార్తీ కూడా ఇంటి ముంగిట్లో పాలు పొంగించి పొంగల్‌ను వేడుకగా నిర్వహించారు. అదేవిధంగా శివకార్తికేయన్‌ తన కుటుంబ సభ్యుల సమేతంగా పొంగల్‌ వేడుకను జరుపుకున్నారు. నటుడు అరుణ్‌ విజయ్‌, నటుడు అశోక్‌ సెల్వన్‌, కీర్తి పాండియన్‌ దంపతులు, దర్శకుడు మారిసెల్వరాజ్‌ తదితర సినీ ప్రముఖులు సంక్రాంతిని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.

 

Videos

ట్రంప్ టారిఫ్ బెదిరింపు..

దొరికింది దోచుకో.. అందినంత దండుకో..!

TDP Leader: సొంత నేతలపైనే దాడులు

Ravi Teja : నా మాటవిని సినిమాలు చేయరా బాబు

సంక్రాంతి అంటేనే సంబరాల పండగ అలాంటిది చంద్రబాబు పుణ్యమా అంటూ..

CM Revanth: పాలమూరుకు అన్యాయం BRS పాలనలోనే!

Hyd: ఏటా 20 లక్షల మంది మరణించడం ఖాయం..!

Brahmanaidu: అమాయకులను కాదు.. దమ్ముంటే మమ్మల్ని చంపండి

Hyd: ఒంటరిగా వెళ్తున్న మహిళ.. రెచ్చిపోయిన ఇద్దరు యువకులు

మహిళా డాక్టర్ భర్తపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

Photos

+5

బుడ్డోడితో బీచ్‌లో బుల్లితెర నటి లహరి (ఫోటోలు)

+5

నువ్వే పెద్ద బంగారానివి! (ఫోటోలు)

+5

మిహికా: 2016.. అంతా సెల్ఫీలమయం (ఫోటోలు)

+5

‘నారీ నారీ నడుమ మురారి’ సక్సెస్‌ సెలెబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

వైభవంగా జగ్గన్నతోట ప్రభల తీర్ధ ఉత్సవాలు (చిత్రాలు)

+5

థాయ్‌లాండ్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

హీరోయిన్ లయ సంక్రాంతి బొమ్మల కొలువు (ఫోటోలు)

+5

సంక్రాంతి పతంగులు ఎగరేస్తోన్న అనసూయ (ఫోటోలు)

+5

సంక్రాంతి సంబురాల్లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)