Breaking News

వెయ్యేళ్ల క్రితం మన ఆలయంపై దండయాత్ర.. సంజయ్‌ లీలా భన్సాలీ కొత్త సినిమా

Published on Mon, 02/16/2026 - 08:02

సోమనాథ్‌ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి... ఈ పదం చెవినబడగానే మన హృదయాంతరాళం పులకాంకితమై, మదిలో సగర్వ భావన మెదలుతుంది. అయితే, వెయ్యేళ్ల క్రితం సోమనాథ్‌పై జరిపిన గజనీ దండయాత్రను వెండితెరపై చూపించేందుకు బాలీవుడ్‌ దర్శకనిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీ సిద్ధమయ్యారు. ఆయన సమర్పణలో ‘జై సోమనాథ్‌’ (JAI SOMNATH)అనే సినిమా రాబోతుంది. దర్శకుడు కేతన్‌ మెహతాతో కలిసి భన్సాలీ(Sanjay Leela Bhansali) తెరకెక్కిస్తున్నారు.  ఆలయం కూలిపోవచ్చు.. విశ్వాసం కాదు అంటూ ఒక పోస్టర్‌తో పాటు వీడియోను విడుదల చేశారు. 2027లో ఈ మూవీ విడుదల చేస్తామని తెలిపారు. ఈ మూవీలో నటించబోయే వారి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

గజనీ మహమ్మద్‌ 1026 జనవరిలో క్రూర, హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తివిశ్వాసాలకు, నాగరికతకు సుసంపన్న ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయజూశాడు. సోమనాథ్‌పై వెయ్యేళ్ల నాటి తొలి దండయాత్ర, అక్కడి దురాక్రమణదారుల క్రూరత్వం, పుణ్యక్షేత్ర విధ్వంసం వంటి అమానుష ఘట్టాలను వివిధ చారిత్రక గ్రంథాలు సవివరంగా నమోదు చేశాయి. వాటిని చదివే ప్రతి పాఠకుడి గుండె విలవిలలాడుతూ లిప్తపాటు విచలితమవుతుంది.

పర్షియా, మధ్య ఆసియా, అఫ్గానిస్థాన్‌లను కలిపి సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని గజనీ మహమ్మద్‌ అనుకున్నాడు.  అందుకు కావాల్సిన ఆర్థిక వనరుల కోసం భారత్‌పైకి దాడి చేసేందుకు దిగాడు.  కీ.శ.1000-1027 సమయంలో 17 సార్లు దండయాత్ర చేసి ఎంతో సంపదను భారత్‌ నుంచి దోచుకున్నాడు. అయితే,  15వ దండయాత్ర ఐశ్వర్యవంతమైన సోమనాథ దేవాలయంపై కొనసాగింది. సోలంకి రాజు భీమదేవుడిని ఓడించి సోమనాథ్‌ ఆలయాన్ని  గజనీ మహమ్మద్‌  కొల్లగొట్టడమే కాకుండా ధ్వంసం చేశాడు. సోమనాథ్‌ ఆలయంపై దాడికి వెయ్యేళ్లయిన సందర్భంగా భారత ప్రధాని మోదీ ఇటీవల ప్రత్యేక వ్యాసం రాసిన సంగతి తెలిసిందే..  (వ్యాసం కోసం క్లిక్‌ చేయండి)

ఆలయంపై దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ రక్షణ కుడ్యంలా నిలిచి, ఆత్మార్పణకూ వెరవని వీరపుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. దాడి జరిగిన ప్రతిసారి మనదైన గొప్ప నాగరికతకు వారసులుగా వారు పుంజుకుంటూ తరతరాలుగా ఆలయ పునర్నిర్మాణం, పునరుజ్జీవనానికి పాటుపడుతూనే వచ్చారు. ఇటువంటి మహనీయులలో అహల్యాబాయి హోల్కర్‌ ప్రముఖులు. సోమ్‌నాథ్‌లో భక్తులు ప్రార్థనలు చేసుకునేలా ఆమె అందించిన అవిరళ కృషి వెలకట్టలేనిది. అటువంటి మహానుభావులు జీవించిన నేలపై నడయాడగలగటం నిజంగా మన అదృష్టం. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)