Breaking News

70 శాతం పూర్తి.. 'స్పిరిట్‌'పై షాకింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి

Published on Sat, 09/06/2025 - 11:14

ప్రభాస్‌ స్పిరిట్‌ సినిమా గురించి దర్శకులు సందీప్‌ రెడ్డి వంగా అప్‌డేట్‌ ఇచ్చారు. తాజాగా ఆయన ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ క్రమంలోనే స్పిరిట్‌ సినిమా గురించి  ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యానిమల్‌ సినిమా తర్వాత సందీప్‌ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో పాన్‌ ఇండియా రేంజ్‌లో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం షూటింగ్‌ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఆయన అన్నారు.

స్పిరిట్‌ సినిమా గురించి సందీప్‌ రెడ్డి  ఇలా అన్నారు. ' ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 70శాతం బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ పూర్తి చేశాం. గతంలో యానిమల్‌ సినిమా సమయంలో కూడా షూటింగ్‌ కంటే ముందే 80శాతం బీజీఎమ్‌ వర్క్‌ పూర్తి చేసి.. ఆ తర్వాతే సెట్స్‌ మీదికి వెళ్లాం. ఇలా చేయడంలో వల్ల సీన్‌ ఎలాంటి ఔట్‌పుట్‌ వస్తుందో తెలిసిపోతుంది. ఆపై సమయంతో పాటు ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా చాలా తగ్గుతుంది. ప్రభాస్‌తో నాకు చాలా సన్నిహితం ఉంది. నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువగానే ఈ సినిమాకు సహకరించారు. పాన్‌ ఇండియా రేంజ్‌ హీరో అనే ఫీలింగ్‌ ఆయనలో కనిపించదు. త్వరలో ప్రభాస్‌తో కలిసే వస్తాం' అంటూ సందీప్‌ చెప్పారు.

ఈ చిత్రంలో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీసాఫీపర్‌పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రకథలో ఫ్లాష్‌బ్యాక్‌ ఉందట. ఈ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ మాఫియా నేపథ్యంలో ఉంటుందని, ఆ సన్నివేశాల్లో ప్రభాస్‌ మాఫియా డాన్‌లా కనిపిస్తారని సమాచారం. త్రిప్తి డిమ్రి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్న విషయం తెలిసిందే..  సందీప్‌ రెడ్డి వంగా  సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించి క్రేజ్‌ తెచ్చుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ స్పిరిట్‌ కోసం పనిచేస్తున్నారు. యానిమల్‌లో కొన్ని పాటలతో పాటు రావణాసుర, డెవిల్‌ తదితర సినిమాలకూ ఆయన సంగీత  వహించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)