Breaking News

అభిమానితో ఇంత సాదాసీదాగా ఉన్న ఈ హీరోయిన్‌ గురించి తెలిస్తే..

Published on Mon, 06/26/2023 - 13:30

కన్నడ దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ 'అభి' సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు రమ్య (దివ్య స్పందన). ఆ మరుసటి ఏడాదే కుట్టు చిత్రంతో తమిళ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో బోలెడన్ని అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. అలా తమిళ, కన్నడ, హిందీలో సినిమాలు చేశారు. అలా 20 సంవత్సరాల పాటు కన్నడ సీమలో తను చెరగని ముద్ర వేశారు. తెలుగులో కూడా నందమూరి కళ్యాణ్‌రామ్‌ అభిమన్యు సినిమాతో పాటు సూర్య హీరోగా నటించిన 'సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌' సినిమాలో రమ్య  అభినయం అందరినీ ఆకట్టుకున్నారు.

(ఇదీ చదవండి: నాడు విజయ్‌ పేరుతో వైరల్‌.. నేడు మళ్లీ ఇలా ట్రెండింగ్‌లో)

కన్నడలో స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకుని భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు. సినిమాలే కాకుండా..  ఆమె రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాంగ్రెస్‌ ఎంపీగా మాండ్య ప్రజలకు సేవలందించించారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజీనామా చేశారు.  కాగా సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉంటోన్న రమ్య సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తన పర్సనల్‌ విషయాలతో పాటు ఫొటోలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. 

చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న శాండల్‌వుడ్ క్వీన్ రమ్య మళ్లీ తెరపైకి వచ్చారు. దీంతోపాటు 'యాపిల్ బాక్స్ స్టూడియోస్' అనే నిర్మాణ సంస్థ ద్వారా కొత్త సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు.  చాలా ఏళ్లుగా తెరపై కనిపించకపోయినా ఆమెకున్న క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. తాజాగా రమ్య ఓ అభిమానితో ఫోటో దిగారు. అదే సమయంలో అభిమానితో రమ్య పలకరించిన తీరు అక్కడి వారందరిని మెప్పిస్తుంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేష్‌.. గతంలోనూ ఇదే చర్చ)

తన అభిమానులతో ఇంత సాదాసీదాగా వ్యవహరించడమే కాకుండా ఎంతో ఆప్యాయంగా పలకరించడం ఆమె అభిమానులకు సంతోషాన్నిచ్చింది. రమ్య  సింప్లిసిటీని అభిమానులతో పాటు పలువురు మెచ్చుకుంటున్నారు.


Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)