Breaking News

నందినికి పొగరు, పట్టుదల.. నాతో పోలికే లేదు: సంయుక్త మీనన్‌

Published on Wed, 04/19/2023 - 07:26

‘‘విరూక్ష’ మిస్టిక్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. హారర్‌ మూవీ కాదు. కానీ ప్రేక్షకులు భయపడతారు. 1990ల నాటి కాలంలో ఈ మూవీ కథ జరుగుతుంది’’ అన్నారు సంయుక్తా మీనన్‌. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరూపాక్ష’. బాపినీడు .బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌పై బీవీఎస్‌ఎన్‌  ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా చిత్ర కథానాయిక సంయుక్తా మీనన్‌ మాట్లాడుతూ– ‘‘బింబిసార’ తర్వాత నేను సంతకం చేసిన రెండో చిత్రం ‘విరూపాక్ష’. అయితే కరోనా లాక్‌డౌన్, తేజ్‌కి ప్రమాదం.. వంటి కారణాలతో ఈ సినిమా లేట్‌ అయింది. ‘విరూపాక్ష’ తర్వాత నేను ఒప్పుకున్న ‘వకీల్‌ సాబ్, సార్‌’ సినిమాలు ముందు రిలీజ్‌ అయ్యాయి. రుద్రవనం అనే గ్రామంలో జరిగే కథే ‘విరూపాక్ష’. నేను నందిని అనే పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశాను. నందినికి పొగరు, పట్టుదల ఎక్కువ ఉంటుంది. నందిని పాత్రకి, నిజ జీవితంలో నా క్యారెక్టర్‌కి పోలికే లేదు. బైక్‌ ప్రమాదం నుంచి కోలుకున్నాక తేజ్‌ గారు ఎంతో ఎనర్జీతో ఈ మూవీ చేశారు. నాకు కామెడీ రోల్స్‌ ఇష్టం.. అవి చేయాలనుంది. ప్రస్తుతం కల్యాణ్‌ రామ్‌గారితో ‘డెవిల్‌’ చిత్రం చేస్తున్నా’’ అన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)