Breaking News

పరమశివుడే నాతో ‘ఓదెల 2’ కథ రాయించాడు: సంపత్‌ నంది

Published on Mon, 04/21/2025 - 16:35

‘‘నాలుగైదేళ్ల క్రితం భక్తి భావంలేని నేను ‘ఓదెల 2’( Odela 2 Movie) కథ రాశానంటే ఆ పరమశివుడే నాతో రాయించాడు. స్క్రీన్‌పై నంది, శివుడు విజువల్స్‌ కనిపించినప్పుడు ప్రేక్షకులు ఫీలైన విషయాన్ని నాకు ఫోన్‌ చేసి, చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. మా ఊరివాళ్లు ఫోన్‌ చేసి, ‘ప్రైడ్‌ ఆఫ్‌ ఓదెల’ అని చెబుతుంటే అద్భుతంగా భావిస్తున్నాను. ఈ సినిమా ఎప్పటికీ నా మనసులో ఉండిపోతుంది’’ అన్నారు దర్శకుడు సంపత్‌ నంది. 

తమన్నా ప్రధాన పాత్రలో, వశిష్ఠ, హెబ్బా పటేల్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓదెల 2’. సంపత్‌ నంది సూపర్‌ విజన్‌లో అశోక్‌ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌పై డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. 

ఈ సందర్భంగా జరిగిన సక్సెస్‌మీట్‌లో సంపత్‌ నంది మాట్లాడుతూ– ‘‘రిలీజ్‌కు ముందే ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. ఆల్రెడీ ‘ఓదెల 2’ సక్సెస్‌బాటలో వెళ్తోంది. ఈ సినిమా అనుకున్నప్పుడే తమన్నాగారిని అనుకున్నాం. ఆమె అద్భుతంగా నటించారు. ‘ఓదెల 2’లోని సమాధి శిక్ష, సైకిల్‌ ఎపిసోడ్, క్లైమాక్స్‌... వీటి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. 

సినిమాలో ఉన్న మంచిని మాత్రమే స్ప్రెడ్‌ చేయండి’’ అన్నారు. ‘‘సినిమా చూసిన ప్రేక్షకులు బాగుందని అంటున్నారు. కానీ కొంతమంది క్రిటిక్స్‌ మాత్రం నెగటివ్‌గా రాశారు. వారికంటే మాకు ప్రేక్షకుల ఫీలింగే ముఖ్యం’’ అని తెలిపారు నిర్మాత డి. మధు. ‘‘మా ‘ఓదెల 2’కు మౌత్‌ టాక్‌ స్ప్రెడ్‌ అవుతోంది. కలెక్షన్స్‌ పెరుగుతున్నాయి’’ అని అన్నారు అశోక్‌ తేజ. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా! 😍🦚

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)