Breaking News

రాయడం గేమ్ చేంజర్ లా మారింది: సమంత

Published on Fri, 01/24/2025 - 03:06

‘‘నేను గత రెండేళ్లుగా డైరీ రాస్తున్నాను. నా జీవితంలో డైరీ రాయడం ఓ గేమ్‌ చేంజర్‌లా మారింది. మీరూ రాయడానికి ప్రయత్నించండి’’ అంటున్నారు హీరోయిన్‌ సమంత (Samantha Ruth Prabhu) . కాగా విజయ్‌ దేవరకొండ, సమంత నటించిన ‘ఖుషి’ సినిమా 2023 సెప్టెంబరు 1న విడుదలైంది. ఈ మూవీ తర్వాత మరో చిత్రంలో నటించలేదు సమంత. అయితే గతేడాది ‘సిటాడెల్‌ హన్నీ బన్నీ’ అనే బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను పలకరించారు సమంత.

ఇక సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారామె. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని షేర్‌ చేస్తూ తన అభిమానులతో టచ్‌లో ఉంటారు సమంత. ఇందులో భాగంగా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె చేసిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది.‘‘డైరీ రాయడం అనేది పాత పద్ధతే. కానీ, రాస్తే మాత్రం మనకు ఓ తీయని జ్ఞాపకంగా ఉంటుంది. నేను గత రెండేళ్లుగా డైరీ రాసే ఆచారాన్ని పాటిస్తున్నాను. ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఏం రాయాలో అర్థం కాదు.

కానీ, ఎంత చిన్న విషయమైనా సరే అందులో రాస్తే... మెల్లిగా అదొక అలవాటుగా మారుతుంది. మనలో చాలా మార్పులు వస్తాయి. నేను కూడా నాకు కష్టమైన, కష్టం అనిపించిన క్షణాల్లో కొన్నింటిని డైరీలో రాశాను. డైరీ రాయడం అనేది నా కష్టతరమైన క్షణాల నుంచి ఉపశమనం కలగడానికి చాలా ఉపయోగపడింది. చెప్పాలంటే డైరీ రాయడం నాకో గేమ్‌ చేంజర్‌లా మారింది. అందరూ రాయడం ప్రయత్నించండి... ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం’’ అంటూ పోస్ట్‌ చేశారు సమంత. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం ‘రక్త్‌ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)