Breaking News

కోటలు దాటుతున్న అంచనాలు.. సినిమానా? నంబర్ల గేమా?

Published on Thu, 07/06/2023 - 15:42

డార్లింగ్ ప్రభాస్ 'సలార్' సినిమా టీజర్ ఎలా ఉందనేది పక్కనబెడితే.. యూట్యూబ్ లో మాత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వ్యూస్, లైక్స్, షేర్స్ ఇలా ప్రతిదానిలోనూ టాప్ లోకి దూసుకెళ్లిపోయింది. థియేటర్లలోకి ఈ మూవీ రావడానికి మరో మూడు నెలల సమయముంది. కానీ ఇప్పటికే అంచనాలు కోటలు దాటేస్తున్నాయి. అయితే ఇక్కడే ఓ విషయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అదే సినీ ప్రేక్షకుల మధ్య చర్చకు కారణమైంది. 

(ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?)

లైకుల రికార్డు
స్టార్ హీరో సినిమాల సందడంటే ఒకప్పుడు వేరుగా ఉండేది. ముందుగా పాటలు, అవొచ్చిన కొన్నాళ్లకు థియేటర్లలోకి సినిమా వచ్చేది. ఇప్పుడేమో ట్రెండ్ మారిపోయింది. ఫస్ట్ లుక్, టీజర్, లిరికల్ సాంగ్స్, ట్రైలర్.. ఇవన్నీ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అన్నట్లు మారిపోయింది. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సలార్' టీజర్ కేవలం 6 గంటల్లోనే మిలియన్ లైక్స్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. 

ప్రభాస్ టాప్
ఇలా జస్ట్ టీజర్‌తో అతి తక్కువ సమయంలో మిలియన్ లైక్స్ సాధించిన హీరోగా టాలీవుడ్‌లో ప్రభాస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. మిగతా హీరోల్లో జూ.ఎన్టీఆర్-36 గంటలు, అల్లు అర్జున్-2 రోజుల 11 గంటలు, మహేశ్ బాబు- 18 రోజులు, రామ్ చరణ్- 20 నెలల సమయం తీసుకున్నారు. ఇదంతా చూస్తుంటే సినిమాలపై అంచనాలు పెరగడం, థియేటర్లలోకి వచ‍్చిన తర్వాత ప్రేక్షకుల్ని అలరించడం అన‍్న దానికంటే సినిమా అనేది నంబర్ల గేమ్‌లా మారుతోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 24 సినిమాలు)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)