Breaking News

ఆ ఆఫర్‌ స్కామ్‌ అనుకున్నాను

Published on Fri, 04/28/2023 - 04:05

‘‘తెలుగులో నా తొలి సినిమా ‘ఏజెంట్‌’. మంచి సినిమాతో పరిచయం కావడం  ఆనందంగా ఉంది’’ అన్నారు సాక్షీ వైద్య. అఖిల్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘ఏజెంట్‌’. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో సాక్షీ వైద్య మాట్లాడుతూ – ‘‘వృత్తి రీత్యా నేను ఫిజియోథెరపిస్ట్‌ని. కోవిడ్‌ సమయంలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక సోషల్‌ మీడియాలో కొన్ని రీల్స్‌ చేశాను. అవి వైరల్‌ అయ్యాయి.

ఆ తర్వాత నా స్నేహితుల సలహా మేరకు కొన్ని ఆడిషన్స్‌ ఇచ్చాను. కొన్ని అవకాశాలు వచ్చినా నచ్చలేదు. కాగా ‘ఏజెంట్‌’ ప్రొడక్షన్‌ టీమ్‌ నుంచి ఒకరు ఫోన్‌ చేసి హీరోయిన్‌ చాన్స్‌ గురించి చెప్పారు. ఈ ఆఫర్‌ను నేను మొదట్లో  స్కామ్‌ అనుకున్నాను. కానీ ముంబైలో ఉన్న ఓ కాస్టింగ్‌ డైరెక్టర్‌ ఏకే ఎంటర్‌ టైన్మెంట్స్‌ పెద్ద బేనర్‌  అని, పెద్ద దర్శకుడు, పెద్ద  స్టార్‌ అని చెప్పగానే హైదరాబాద్‌ వచ్చి ఆడిషన్స్‌ ఇచ్చాను. ‘ఏజెంట్‌’ కంప్లీట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. ఈ చిత్రంలో పైలెట్‌ పాత్రలో కనిపిస్తాను. ‘ఏజెంట్‌’ నాకు మంచి అనుభూతిని ఇచ్చింది. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌తో ‘గాంఢీవదారి అర్జున’ చేస్తున్నాను’’ అన్నారు.  

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)