Breaking News

ధోనీ భార్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తమిళ సినిమా అందుకేనని!

Published on Thu, 07/27/2023 - 09:26

టీమిండియా మాజీ కెప్టెన్ ధోని నిర్మాతగా మారి తొలిసారిగా తమిళంలో తీసిన చిత్రం 'ఎల్‌జీఎం'. ధోనీ సతీమణి సాక్షి ధోని నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీతో రమేష్‌ తమిళమణి దర్శకుడు, సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హరీష్‌ కళ్యాణ్‌, ఇవనా జంటగా నటించిన ఇందులో నటి నదియా, యోగిబాబు, ఆర్‌జే. విజయ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. విశ్వజిత్‌ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం వారం తెరపైకి రానుంది. 

(ఇదీ చదవండి: మరోసారి వివాదంలో 'బిగ్ బాస్'.. మొదలవడానికి ముందే!)

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ మంగళవారం సాయంత్రం చైన్నెలోని పలోజా థియేటర్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ వేదికపై దర్శకుడు మాట్లాడుతూ ఒక సాధారణ కథను బ్రహ్మాండంగా తెరకెక్కించే ప్రయత్నమే ఎల్‌జీఎం అని తెలిపారు. ధోనీ నిర్మించిన చిత్రంలో నటించడం అదృష్టం అని నటుడు హరీష్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. తన వివాహానంతరం విడుదల అవుతున్న చిత్రం ఇదని,ఆ విధంగా తన భార్య లక్కీ ఛామ్‌ అని అన్నారు. 

నిర్మాత సాక్షి ధోని మాట్లాడుతూ... తమకు, తమిళ ప్రేక్షకులకు మధ్య భాష సమస్యే కాదన్నారు. ధోనీని తమిళ ప్రజలు ఎప్పుడో ఆదరించారని, తమిళ చిత్రం చేయడానికి అదీ ఒక కారణం అని అన్నారు. సహజత్వంతో కూడిన ఓ సినిమా చేయాలనుకున్నామని, అదే ఎల్‌జీఎం అని చెప్పుకొచ్చారు. మూవీ చూసిన ధోనీ చాలా బాగుందని మెచ్చుకున్నట్లు సాక్షి పేర్కొన్నారు. తమిళంలో ఈ వారం రిలీజ్ అవుతోంది కానీ తెలుగులో వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 4న రాబోతుంది.

(ఇదీ చదవండి: 'బేబీ' డైరెక్టర్‌కి విశ్వక్‌సేన్ కౌంటర్స్.. కానీ!?)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)