Breaking News

ఆ దూరాన్ని వెయ్‌ దరువెయ్‌ తగ్గిస్తుంది

Published on Thu, 03/14/2024 - 05:14

‘‘పూర్తి స్థాయి వినోదం, ఫ్యామిలీ డ్రామా, ఓ చిన్న సందేశం.. ఇలా అన్ని వాణిజ్య అంశాలతో ‘వెయ్‌ దరువెయ్‌’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పగలను. నా కెరీర్‌లో ఈ మధ్య గ్యాప్‌ వచ్చింది. ఆ దూరాన్ని ‘వెయ్‌ దరువెయ్‌’ తగ్గిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో సాయిరామ్‌ శంకర్‌ అన్నారు. నవీన్‌ రెడ్డి దర్శకత్వంలో సాయిరామ్‌ శంకర్, యషా శివకుమార్‌ జంటగా నటించిన చిత్రం ‘వెయ్‌ దరువెయ్‌’. లక్ష్మీనారాయణ ΄పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై దేవరాజు ΄పొత్తూరు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిరామ్‌ శంకర్‌ మాట్లాడుతూ– ‘‘నవీన్‌ ‘వెయ్‌ దరువెయ్‌’ కథ చెప్పగానే నచ్చింది.

ఇందులో నా పాత్ర చాలా సరదాగా ఉంటుంది. నాకు తప్పకుండా మంచి కమ్‌ బ్యాక్‌ మూవీ అవుతుందనిపించింది. ఈ సినిమాని 35 రోజుల్లోనే పూర్తి చేశామంటే ఆ క్రెడిట్‌ నిర్మాత, డైరెక్టర్, కెమెరామేన్‌లదే. పైగా నటీనటులందరూ అనుభవం ఉన్నవాళ్లు కావడం కూడా మరో కారణం. ఈ మూవీకి భీమ్స్‌గారి సంగీతం, నేపథ్య సంగీతం ప్లస్‌ అయింది. నా 20 ఏళ్ల సినీ ప్రయాణంలో విజయాలు, పరాజయాలూ ఉన్నాయి. ప్రస్తుతం ఆచితూచి మంచి కథలు ఎంచుకుంటున్నా. మా అన్నయ్య (పూరి జగన్నాథ్‌) దర్శకత్వంలో హీరోగా చేసే స్థాయికి నేనింకా చేరుకోలేదు. ఆ స్థాయి, ఆ స్టార్‌డమ్, నా మార్కెట్‌ పరిధి పెరిగినప్పుడు చేస్తాను. ప్రస్తుతం నేను నటించిన ‘ఒక పథకం ప్రకారం, రీ సౌండ్‌’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)