సైఫ్‌ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు అరెస్ట్‌

Published on Fri, 01/17/2025 - 11:36

బాలీవుడ్‌  ప్రముఖ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌(54)పై(Saif Ali Khan) దాడిచేసిన వ్యక్తిని ముంబై పోలీసులు కొంతసమయం క్రితం అరెస్ట్‌ చేశారు. సైఫ్‌పై దాడి ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు(Bandra Police) రంగంలోకి దిగారు. సుమారు 36 గంటల్లో అతన్ని బాంద్రా ప్రాంతంలోనే అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం నిందుతుడిని పోలీసులు విచారిస్తున్నారు.  

రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్‌ 331(4), సెక్షన్‌ 311 కింద అతనిపై పోలీసులు కేసు పెట్టారు.  సైఫ్‌పై దాడి ఘటనలో మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో వారు విచారణ జరుపుతున్నారు. 

(ఇదీ చదవండి: 'గేమ్‌ ఛేంజర్‌' ప్రసారం చేసిన కేబుల్‌ ఆపరేటర్‌ ఆరెస్ట్‌)

దొంగతనం కోసమే దుండగుడు సైఫ్‌ ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అయితే, తాజాగా నిందితుడు పట్టుబడటంతో మరిన్ని వివరాలు వెళ్లడి అయ్యే ఛాన్స్‌ ఉంది. సైఫ్, కరీనా దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఫ్లాట్‌లో నిద్రిస్తున్న సమయంలో అలికిడి వినిపించింది. 

అప్పటికే సైఫ్‌ చిన్నకుమారుడు జహంగీర్‌ గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను పనిమనిషి గమనించి బిగ్గరగా కేకలు వేసింది. అలారం మోగించింది. దాంతో అతడు ఆమెపై కత్తి దూశాడు. ఈ శబ్దాలు వినిపించి నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్‌ అలీ ఖాన్‌ ఆ గదిలోకి వచ్చి దుండగుడిని అడ్డుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలోనే సైఫ్‌పై కత్తితో విచక్షణారహితంగా నిందితుడు పొడిచాడు.
 




 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)