Breaking News

ప్రాణ భయం.. వేరే దేశంలో ఇల్లు కొన్న 'దేవర' విలన్

Published on Tue, 04/22/2025 - 14:58

ఆదిపురుష్, దేవర సినిమాల్లో విలన్ పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులకు కాస్త దగ్గరైన నటుడు నటుడు సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan). ఇకపోతే మూడు నెలల క్రితం ఇతడు తన ఇంట్లో ఉన్నప్పుడు ఓ దుండగుడు ఇతడిపై దాడి చేశాడు. తక్షణమే స్పందించడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతానికైతే అంతా సెట్ అయింది. కానీ సైఫ్ మనసులో మాత్రం భయం అలానే ఉండిపోయింది.

దుండగుడి దాడి వల్ల బాగా భయపడిపోయిన సైఫ్ అలీఖాన్.. ఇంకెప్పుడైనా తనపై దాడి జరగొచ్చేమో అనుకుని ఖతార్ దేశంలో ఇల్లు(New House) కొనుక్కున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే బయటపెట్టాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సైఫ్.. ఇల్లు కొనడానికి గల కారణాన్ని కూడా బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక)

'అది నా హాలీడే హోమ్. అక్కడ ఇల్లు కొనుక్కోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి జర్నీ సులభమవుతుంది. అక్కడ చాలా సేఫ్టీగా అనిపించింది. ఖతార్ అందమైన దేశం. అక్కడున్నప్పుడు చాలా రిలాక్స్ డ్ గా అనిపిస్తుంది. ఆ దేశంలో ఓ ఇంటికి మరో ఇంటికి చాలా దూరం ఉంటుంది. రీసెంట్ గా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు వాతావరణం కూడా అద్భుతంగా అనిపించింది. దీంతో అక్కడ ఇల్లు కొనేశాను. త్వరలో నా కుటుంబాన్ని కూడా అక్కడికి షిఫ్ట్ చేసేస్తా' అని సైఫ్ చెప్పుకొచ్చాడు.

సైఫ్ విషయానికొస్తే.. చాలా ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాడు. ‍కొన్నేళ్ల ముందు వరకు హీరోగా చేశాడు. ఇప్పుడు మాత్రం విలన్, సహాయ పాత్రలు చేస్తూ బిజీ అయిపోయాడు. ఇతడికి తొలి భార్య వల్ల సారా అలీఖాన్, ఇబ్రహీం సంతానం కలిగారు. కరీనా కపూర్(Kareena Kapoor)ని రెండో పెళ్లి చేసుకోగా.. ఇద్దరు కొడుకులు పుట్టారు. ఇకపోతే సైఫ్ నటించిన జ్యూయెల్ థీప్ మూవీ.. ఏప్రిల్ 25న నెట్ ఫ్లిక్స్ లో నేరుగా రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: తల్లిదండ్రులయిన నటుడు విష్ణు విశాల్‌, జ్వాలా గుత్తా)

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)