Breaking News

వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సాయి పల్లవి

Published on Sun, 08/02/2026 - 07:46

సహజత్వానికి మారుపేరు నటి సాయి పల్లవి . డాక్టర్‌ అయ్యి యాక్టర్‌ అయిన ఈ తమిళ నటి ఆదిలో నటనపై ఆసక్తితో తమిళంలో చిన్న చిన్న పాత్రలు పోషించినా, మలయాళంలో ప్రేమమ్‌ చిత్రంతో అనూహ్యంగా దూసుకొచ్చారు. ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు ఈ భామను వెతుక్కుంటూ వచ్చాయి. అలా తెలుగులో నటించిన చిత్రాలు వరుసగా విజయాలను సాధించడంతో అక్కడ స్టార్డమ్‌ వచ్చింది. ఆ తరువాత కోలీవుడ్‌లో కాస్త ఆలస్యంగా అవకాశాలు వచ్చినా, గార్గి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత నటించిన కొన్ని చిత్రాలు నిరాశ పరిచినా అమరన్‌ చిత్రం ఘన విజయాన్ని అందించింది. మళ్లీ తమిళంలో చిన్న బ్రేక్‌ వచ్చింది.

అందుకు కారణం తెలుగులో బిజీగా నటించడం, అదే సమయంలో బాలీవుడ్లో అవకాశాలు రావడం కారణం కావచ్చు. హిందీలో సాయి పల్లవి నటించిన ఏక్‌ దిన్‌ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. అయితే ప్రస్తుతం నటిస్తున్న రామాయణ చిత్రంలో సీతగా ఆమె నటనపై ఆసక్తి నెలకొంది. కారణం ఆ పాత్రలో ఇంతకు ముందు పలువురు ప్రముఖ నటీమణులు నటించడమే. కాగా ఇటీవల విడుదలైన రామాయణ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

ఇకపోతే ఇప్పుడు తమిళంలో మరో రెండు క్రేజీ చిత్రాల్లో సాయి పల్లవి కథానాయకిగా నటిస్తున్నారు. అందులో ఒకటి ధనుష్‌ కు జంటగా నటిస్తున్న ఓం చిత్రం కాగా, రెండోది మణిరత్నం దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి సరసన నటిస్తున్న రొమాంటిక్‌ లవ్‌ స్టొరీ చిత్రం. ఈ రెండు చిత్రాలు సాయి పల్లవి స్థాయిని మరింత పెంచేవిగా ఉంటాయని అంటున్నారు కోలీవుడ్‌ వర్గాలు. గ్లామర్‌కు దూరంగా తన సహజమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)