Breaking News

వరుస ఫ్లాపులు.. సాయిపల్లవి షాకింగ్‌ నిర్ణయం!

Published on Tue, 08/02/2022 - 13:17

వైవిధ్యమైన కథలు, పాత్రల్లో నటిస్తూ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చున్నారు నేచురల్‌ బ్యూటీ సాయిపల్లవి. మలయాళం చిత్రం ‘ప్రేమమ్‌’ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ..తక్కువ సమయంలోనే టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ కేవలం తన నటనతోనే ​లక్షలాది మంది అభిమానులను సంపాధించుకుంది. కోట్ల రూపాయలను వస్తాయని ఆలోచించకుండా.. తనకు సంతృప్తినిచ్చే పాత్రలు మాత్రమే చేస్తానంటోంది సాయి పల్లవి. అందుకే సాయి పల్లవి అంటే సినీ ప్రియుల్లో ఎనలేని గౌరవం పెరిగిపోయింది.

ఇక ఇటీవల కాలంలో సాయి పల్లవి లేడీ ఓరియెంటెండ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయింది. అందుకే సాయి పల్లవిని అభిమానులు లేడీ సూపర్‌ స్టార్‌ అంటూ పిలవడం మొదలు పెట్టారు. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం సాయి పల్లకి బ్యాడ్‌ టైం నడుస్తోంది. ఇటీవల ఈ నేచురల్‌ బ్యూటీ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడుతున్నాయి.  

ఆ మధ్య భారీ అంచనాల మధ్య వచ్చిన ‘విరాటపర్వం’ బాక్సాఫీస్‌ వద్ద దారణంగా బోల్తా పడింది. ఇటీవల వచ్చిన గార్గి సినిమా కూడా ప్లాప్‌గానే మిగిలిపోయింది. ఇలా వరుసగా ఫ్లాపులు రావడానికి కారణం సాయి పల్లవి ఎంచుకున్న కథలనే తెలుస్తోంది. కేవలం సందేశాత్మక చిత్రాలను మాత్రమే ఎంచుకుంటూ వెళ్తోంది. అయితే సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయినప్పటికీ.. కమర్షియల్‌గా నిర్మాతలకు మాత్రం నిరాశే మిగులుతోంది.

దీంతో కొన్ని విషయాల్లో మారాలని సాయి పల్లవికి నిర్మాతలు సలహా ఇచ్చారట. గ్లామర్‌కు ప్రాధన్యత ఉన్న కమర్షియల్‌ చిత్రాలను కూడా చేయాలని చెప్పారట.  అయితే ఆఫర్స్‌ రాకపోతే క్లినిక్‌ అయినా పెట్టుకుంటా లేదా ఉద్యోగం అయినా చేసుకుంటా కానీ నా స్థాయిని తగ్గించుకొని ఇష్టంలేని సినిమాల్లో నటించలేనని చెప్పిందట సాయి పల్లవి. ఈ లెక్కన చూసుకుంటే సాయి పల్లవి కెరీర్‌ క్లోజ్‌ అయినట్లేననే టాక్‌ వినిప్తోంది. మరి తన పంథాల్లోనే వెళ్తూ సాయి పల్లవి హిట్‌ కొడుతుందా లేదా మనసు మార్చుకొని గ్లామర్‌ పాత్రలు ఒప్పుకుంటుందా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.

Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)