Breaking News

సాయి పల్లవికి అవార్డ్స్‌ తెచ్చిపెట్టిన సినిమాలు ఎన్నో తెలుసా..?

Published on Sat, 07/13/2024 - 08:23

మ‌ల‌యాళీ బ్యూటీ సాయి పల్లవి టాలెంట్‌కు సినీ అభిమానులు ఫిదా అవుతారు. హీరోయిన్‌గా  ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఆమె స్టార్‌గా ఎదిగింది. మర్‌ పాత్రల కన్నా కథలో బలం ఉన్న  పాత్రలనే ఎంపిక చేసుకుంటూ సత్తా చాటింది. తొమ్మిదేళ్ల కెరీర్‌లో ఆమె 19 సినిమాల్లో నటించింది. అయితే, ప్రతి చిత్రం కూడా ఒక ప్రత్యేకమనే చెప్పాలి. అలా మలయాళం, తెలుగు, త‌మిళంలోనూ ఆమెకు భారీగా ఫ్యాన్స్‌ ఉన్నారు.

తాజాగా సౌత్ ఫిలిం ఇండ‌స్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ 2023లో సాయిపల్లవికి అవార్డ్‌ దక్కింది. అయితే, సాయి పల్లవి అరుదైన రికార్డ్ క్రియేట్‌ చేసింది. 68 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌లో గార్గి చిత్రానికి తమిళంలో ఉత్తమ నటిగా అవార్డు దక్కితే.. తెలుగులో విరాటప‌ర్వం చిత్రానికి గాను క్రిటిక్స్‌ విభాగంలో ఉత్తమ నటిగా అవార్డ్‌ దక్కించుకుంది. ఇలా రెండు భాషల్లోనూ ఒకే ఏడాదిలో ఈ ఘనత సాధించిన హీరోయిన్‌గా ఆమె గుర్తింపు పొందింది.

ప్రేమమ్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ యూత్‌కు బాగా కనెక్ట్‌ అయింది.  ఆ త‌ర్వాత తెలుగులో ఫిదాలో భానుమ‌తిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా  ఫిలింఫేర్ అవార్డ్స్‌లో ఓ అరుదైన ఘ‌న‌త‌ను కూడా ఆమె అందుకుంది.  సౌత్‌ ఇండియాలో అతి తక్కువ కాలంలోనే ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకున్న హీరోయిన్‌గా సాయి ప‌ల్ల‌వి నిలిచింది.

సాయి ప‌ల్లవి అవార్డులు అందుకున్న సినిమాలు

  • ప్రేమ‌మ్ (2015) – ఉత్త‌మ న‌టి (డెబ్యూ)

  • ఫిదా (2017) – ఉత్త‌మ న‌టి

  • ల‌వ్ స్టోరీ (2021) – ఉత్త‌మ న‌టి

  • శ్యామ్​ సింగ‌రాయ్ (2021) – ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్)

  • గార్గి (2022) – ఉత్త‌మ న‌టి

  • విరాట‌ప‌ర్వం (2022) – ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)