Breaking News

డబ్బు కోసం ముద్దు సీన్లలో నటించలేను : సాయి పల్లవి

Published on Sun, 07/12/2026 - 08:33

సినీ కథానాయకల్లో ఒక్కొక్కరికీ ఒక్కో బాణి ఉంటుంది. కొందరు అందచందాలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. కొందరు తమ నటనా ప్రతిభనే నమ్ముకుంటారు. ఇంకొకరు అన్ని రకాల పాత్రలను పోషించాలని కోరుకుంటారు. వీటిలో రెండవ కేటగిరీకి చెందిన నటి సాయి పల్లవి. వైద్య వృత్తి చదివినా నటనపై ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశించిన సాయి పల్లవి ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రంతో తానేమిటో నిరూపించుకున్నారు. తర్వా తెలుగు, తమిళ భాషల్లో కూడా నటిస్తూ స్టార్‌ అంతస్తుకు చేరుకున్నారు.

ఈమధ్య ఈమె శివకార్తికేయన్‌కు జంటగా నటించిన అమరన్‌ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. ముఖ్యంగా సాయి పల్లవి నటన సర్వత్ర ప్రశంసలు అందుకుంది. కాగా ఇటీవల బాలీవుడ్‌ లో కూడా ఎంట్రీ ఇచ్చారు. అక్కడ అమీర్‌ ఖాన్‌ వారసుడు జునైత్‌ ఖాన్‌గా ఏక్‌ దిన్‌ అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం భారతీయ ఇతిహాసం అయినా రామాయణం నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందుతున్న రామాయణ అని పాన్‌ ఇండియా చిత్రంలో సీతగా నటిస్తున్నారు.

అదేవిధంగా తమిళంలో ధనుష్‌ కు జంటగా ఓమ్‌ అనే భారీ బడ్జెట్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మరో నాయిక శ్రీలీల నటిస్తున్నారు. ఇదిలా ఉండగా సాయి పల్లవి నటిగా ఆది నుంచి ఒక ప్రిన్సిపల్స్‌ పాటిస్తూ వస్తున్నారు. మేకప్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడం, నటనలో సహజత్వానికి ప్రాముఖ్యతను ఇవ్వడం, గ్లామర్‌ కు దూరంగా ఉండటం, కథా పాత్రలు నచ్చితేనే నటించడానికి సమ్మతించడం వంటివి ఈమె కచ్చితంగా పాటిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో సాయి పల్లవి ఇటీవల ఒక భేటిలో పేర్కొంటూ ..‘నా కెరీర్‌ ప్రారంభం నుంచే నేను చిత్రాల్లో ముద్దు సన్నివేశాలకు వ్యతిరేకిని. అలాంటి సన్నివేశాలు నటించడానికి నా మనసు అంగీకరించదు. ఈ ప్రపంచంలో ప్రతి యువతి యువకుడు సంతోషంగా జీవించడానికి ఓ ఇల్లు, మంచి కారు ఉండాలని కోరుకుంటారు. దేవుని దయవల్ల నాకు అలాంటి ఆడంబర జీవితం, సంతోషం లభించాయి. అదేవిధంగా ఆడంబరాల కోసం మాత్రమే నేను ఎప్పుడూ సినిమాల్లో నటించలేదు. మరో కొత్త కారు కొనుక్కోవడానికో, డబ్బు కోసం నటులతో ముద్దు సన్నివేశాల్లో నటించాల్సిన అవసరం నాకు లేదు. అదే విధంగా హద్దులు మీరిన ప్రేమ సన్నివేశాల్లో నటించాలంటే వేరెవరినైనా వెతుక్కోండి.. నా వద్దకు రాకండి. మంచి నటన కోసం మాత్రమే నా వద్దకు రండి’ అని నటి సాయి పల్లవి పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)