Breaking News

నేను పొట్టి బట్టలు వేసుకోకపోవడానికి ఆ వీడియోనే కారణం: సాయి పల్లవి

Published on Mon, 06/13/2022 - 19:04

హీరోయిన్‌ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అందంతో పాటు అభినయంతోనూ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుందీ భామ. ఇటీవలె శ్యామ్‌సింగరాయ్‌తో హిట్టు కొట్టింది. త్వరలోనే విరాట పర్వంతో ప్రేక్షకులను పలకరించనుంది. జూన్‌ 17న విరాట పర్వం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సాయి పల్లవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అయితే సినిమాల్లో గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, కేవలం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది. 

చదవండి: పోస్ట్‌ వెడ్డింగ్‌ అంటూ ఫొటోలు షేర్‌ చేసిన కీర్తి, పక్కనే మరో హీరోయిన్‌

ఎక్సోపోజింగ్‌కు దూరంగా ఉంటూ స్టార్‌ హీరోయిన్‌ గుర్తింపు పొందిన ఆమె తాజాగా స్కిన్‌ షోపై స్పందించింది. ఈ తాజా ఇంటర్య్వూలో పొట్టి బట్టలు వేసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అలాంటి అవుట్‌ ఫిట్‌లో కంఫర్ట్‌ ఉండనని చెప్పింది. అయితే దానికి కారణమేంటో కూడా ఈ సందర్భంగా సాయి పల్లవి వెల్లడించింది. తాను పొట్టి బట్టలు ధరించకపోవడానికి ఒక వీడియో కారణమంటూ తెలిపింది. ‘డాక్టర్‌ కోర్స్‌లో భాగంగా నేను జార్జీయా వెళ్లాను. ఆ సమయంలో టాంగో డాన్స్‌ నేర్చుకున్నాను. అయితే ఓ ఈవెంట్‌లో నేను టాంగ్‌ డాన్స్‌ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ డాన్స్‌ చేయాలంటే అందుకు అనుకూలంగా ఉండే కాస్ట్యూమ్స్‌ వేసుకోవాలి’ అని పేర్కొంది.

చదవండి: విజయ్‌, రష్మికల షూటింగ్‌ ఫొటోలు లీక్‌.. డైరెక్టర్‌ అప్‌సెట్‌

‘అయితే నేను ఈ డాన్స్‌ షో చేయడం మా పేరెంట్స్‌కు ఇష్టం లేదు. అయినా వారిని ఒప్పించి పర్ఫామ్‌ చేశాను. అదే సమయంలో నాకు ప్రేమమ్‌ మూవీ ఆఫర్‌ వచ్చింది. ఈ సినిమాలో నా నటనకు ప్రశంసలు వచ్చాయి. కానీ అప్పుడే జార్జీయాలో ఇచ్చిన నా డాన్స్‌ పర్ఫెమెన్స్‌ వీడియో బయటకు వచ్చింది. అది ఎలా బయటకు వచ్చిందో తెలియదు. కానీ, సోషల్‌ మీడియాలో అది వీపరతంగా వైరల్‌ అయ్యింది. ప్రేమమ్‌లో నా పాత్రను ప్రశంసలు రాగా..ఈ వీడియోతో విమర్శలు వచ్చాయి. దారుణమైన కామెంట్స్‌ చేశారు. అవి చూసి చాలా బాధపడ్డాను. ఇబ్బందిగా అనిపించింది. ఇక ఆ క్షణం నుంచి పొట్టి బట్టలు వేసుకోవద్దని నిర్ణయించుకున్న’ అంటూ వివరించింది సాయి పల్లవి. 

#

Tags : 1

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)