YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల
Breaking News
రామాయణ కంటే ముందే సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ..
Published on Sat, 09/13/2025 - 04:42
హీరోయిన్ సాయిపల్లవి హిందీలో నటించిన తొలి చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ చిత్రం ‘మేరే రహో’. సునీల్ పాండే దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 12న రిలీజ్ కానుంది. ఒకరితో ఒకరికి పరిచయం లేని ఓ అబ్బాయి, అమ్మాయి ఓ రోజు విచిత్రకరమైన పరిస్థితుల్లో కలుసుకుంటారు.
ఆ పరిచయం వారి జీవితాలను ఎలా మార్చేసింది? అన్న కోణంలో ఈ ‘మేరే రహో’ సాగుతుందని బాలీవుడ్ సమాచారం. తొలుత ఈ సినిమాకు ‘ఏక్ దిన్’ అనే టైటిల్ అనుకున్నారు. నవంబరులో రిలీజ్ ప్లాన్ చేశారు. శుక్రవారం ఈ సినిమా టైటిల్, విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా కాకుండా హిందీలో ‘రామాయణ’ సినిమాలో సీతగా సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే.
Tags : 1