Breaking News

సాయిపల్లవి చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌

Published on Sat, 09/13/2025 - 09:01

కోలీవుడ్‌లో నటుడు శింబుది ప్రత్యేక స్థానం. విమర్శలు, వివాదాల్లో చిక్కుకున్నా, అపజయాలను ఎదుర్కొన్నా, ఆయన క్రేజే వేరు. 50 చిత్రాలకు చేరుకున్న ఈయన తాజాగా కొన్ని క్రేజీ చిత్రాలను చేస్తున్నారు. అందులో ఒకటి వెట్రిమారన్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం. ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్‌ కథా చిత్రం అని చిత్ర వర్గాల  సమాచారం. వెట్రిమారన్‌కు దర్శకుడిగా ఒక ప్రత్యేక బాణి ఉంది. ఆయన కథలన్నీ సమాజంలోంచి, ముఖ్యంగా అట్టడుగు జనాల జీవితాలను ఆవిష్కరించేవిగా ఉంటాయి. 

కాగా ఇంతకుముందు ధనుష్‌ హీరోగా ఉత్తర చెన్నై నేపథ్యంలో వడచెన్నై అనే చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. కాగా తాజాగా మరోసారి అదే నేపథ్యంలో మరో కోణంలో శింబు హీరోగా చిత్రం చేస్తున్నారు. ఇది శింబు కథానాయకుడుగా నటిస్తున్న 49వ చిత్రం అవుతుంది. ఇందులో ఈయనకు జంటగా పూజాహెగ్డే నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆ పాత్రలో సాయిపల్లవి నటించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈమె ప్రస్తుతం హిందీలో ఏక్‌ దిన్‌ చిత్రాన్ని పూర్తి చేసి, రామాయణ 1, 2 చిత్రాలను చేస్తున్నారు. ఇందులో సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. చాలా గ్యాప్‌ తరువాత ఈమె మళ్లీ తమిళంలో నటించనున్నారన్నమాట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.  

Videos

Appalaraju: ప్రభుత్వ ఆస్తులను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా ఇస్తున్నారు

చంద్రబాబు బిస్కెట్ల కోసం బరితెగించిన ఈనాడు పత్రిక

మిజోరం రాజధానికి కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

మంత్రి నారాయణకు బిగ్ షాక్ డయేరియా బాధితుల ఫ్యామిలీ నిలదీత

YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల

రాజధానిపై చంద్రబాబు హాట్ కామెంట్స్

బరువెక్కుతున్న అమీర్..! కారణం అదేనా..?

RK Roja: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

ఈ వయసులో నీకెందుకు బాబు.. జూ.ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు ఇచ్చేయ్

Diarrhea Cases: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 106 మంది

Photos

+5

వింటేజ్ లుక్స్ లో ఫరియా అబ్దుల్లా నెట్టింట ఫొటోలు వైరల్

+5

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

+5

మాల్దీవుస్‌లో 'డిజే టిల్లు' బ్యూటీ.. నేహా శెట్టి ఫోటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)

+5

‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)

+5

'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ నటి సుధ, అనిరుధ్, సప్తగిరి (ఫొటోలు)