Breaking News

సాయిపల్లవి.. నన్ను అన్నయ్య అనేసరికి బాధపడ్డా: స్టార్ హీరో

Published on Sat, 10/19/2024 - 11:08

సాయిపల్లవి.. ఓ స్టార్ హీరోని 'అన్న' అనేసింది. ఈ విషయాన్ని సదరు హీరోనే బయటపెట్టాడు. ఆమె అలా పిలిచినందుకు అప్పుడు చాలా బాధపడ్డాడని కూడా చెప్పాడు.'అమరన్' అనే తమిళ మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా హీరో శివకార్తికేయన్ ఇదంతా చెప్పాడు.

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి లేటెస్ట్ మూవీ 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత కథతో ఈ మూవీ తీశారు. అక్టోబర్ 31న తెలుగు-తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శివ కార్తికేయన్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యేంతవరకు వచ్చాడు. తన కెరీర్ ప్రారంభంలో సాయిపల్లవితో జరిగిన ఫన్నీ సంఘటననే ఇప్పుడు బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా)

'గతంలో నేను టీవీ ఛానెల్‌లో పనిచేస్తున్నప్పుడు సాయిపల్లవిని మొదటిసారి కలిశాను. నేను హోస్ట్ చేసిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఆ తర్వాత 'ప్రేమమ్'లో ఈమె నటన నాకు తెగ నచ్చేసింది. దీంతో ఫోన్ చేసి అదే విషయాన్ని చెప్పాను. వెంటనే 'థ్యాంక్యూ అన్న' అనేసింది. నన్ను అన్నా అని పిలిచినందుకు అప్పుడు చాలా బాధపడ్డాను' అని శివకార్తికేయన్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో 'తండేల్' సినిమా చేస్తోంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ మూవీ కూడా నిజ జీవిత సంఘటనల ఆధారంగానే తీస్తున్నారు. కొందరు తెలుగు జాలర్లు.. పాకిస్థాన్ అధికారులకు చిక్కి, అక్కడి జైల్లో కొన్నాళ్లు గడిపారు. ఈ సినిమాని క్రిస్మస్ లేదా సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు మూవీస్‌తో మరోసారి బౌన్స్ బ్యాక్ అవుతాననే సాయిపల్లవి ధీమాతో ఉంది.

(ఇదీ చదవండి: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో 'రియా'.. అసలు ఈమె ఎవరంటే?)

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)