Breaking News

స్టార్ హీరో ట్వీట్‌కు సచిన్ రిప్లై.. అదేంటో తెలుసా!

Published on Fri, 02/02/2024 - 18:24

కన్నడ స్టార్‌ సుదీప్‌ తెలుగువారికి కూడా సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం తమిళం, కన్నడ సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. గతేడాది కబ్జా సినిమాతో అలరించిన కిచ్చా.. ప్రస్తుతం మ్యాక్స్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా నెటిజన్ల్‌తో ఆయన చిట్‌చాట్‌ నిర్వహించారు. ట్విటర్‌ వేదికగా ఆస్క్‌ కిచ్చా అనే సెషన్‌లో పాల్గొన్నారు. 

ఈ సెషన్‌కు హాజరైన పలువురు నెటిజన్స్‌ ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. ఇటీవల సచిన్‌ను కిచ్చా సుదీప్ కలిశారు. ఈ సందర్భంగా ఆ ఫోటోను షేర్ చేసిన నెటిజన్‌.. కిచ్చాను ఇలా అన్నారు. సచిన్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. అన్న ఈ ఫోటో గురించి ఒక్కమాటలో చెప్పండి.. సచిన్‌ను కలిసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది' అని అడిగాడు. దీనికి సుదీప్ రిప్లై ఇచ్చారు. ఈ ఫోటోను చూస్తే 'జస్ట్‌ లుకింగ్‌ లైక్‌ ఏ వావ్ అంటూ.. ఇది నా జీవితంలో మధురమైన జ్ఞాపకం' అంటూ బదులిచ్చారు.

అయితే ఈ ట్వీట్‌ చూసిన మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్‌ సైతం కిచ్చా సుదీప్ రిప్లై ఇచ్చారు.  మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు తీసిన మన ఫోటో ఎంతో అద్భుతంగా ఉంది. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, జీవితంలో ఆనందం ఉండాలని కోరుకుంటున్నా' అంటూ సచిన్ ట్వీట్ చేశారు. ఇది చూసిన కన్నడ స్టార్‌ హీరో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోకు సచిన్‌ రిప్లై ఇచ్చారంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే ఈ ట్వీట్‌కు కన్నడ స్టార్ హీరో సుదీప్‌ సైతం స్పందించారు. 'వావ్.. నేను ఇది ఊహించలేదు... మీరు నాకు మరో మరపురాని క్షణాన్ని అందించారు సార్' అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)