Breaking News

ఇంటర్‌ నేషనల్‌ డ్రాగన్‌

Published on Wed, 09/03/2025 - 03:56

‘డ్రాగన్‌’ రేంజ్‌ గ్లోబల్‌ లెవల్లో ఉంటుందట. ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ సినిమా ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

అక్టోబరులో ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ విదేశాల్లోప్రారంభం అవుతుందని, ఈ దిశగా చిత్రయూనిట్‌ ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలుపెట్టిందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అంతేకాదు... తన గత చిత్రాలు ‘కేజీఎఫ్‌’లో ‘కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌’, ‘సలార్‌’లో ఖాన్సార్‌ప్రాంతాలు ఉన్నట్లే ‘డ్రాగన్‌’ సినిమాలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారట ప్రశాంత్‌ నీల్‌. 

‘కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్, ఖాన్సార్‌’ల ప్రస్తావన ఇండియా వైడ్‌గా ఉంటే, ‘డ్రాగన్‌’ చిత్రం కోసం ప్రశాంత్‌ నీల్‌ సృష్టిస్తున్న ప్రపంచానికి ఇంటర్‌ నేషనల్‌ టచ్‌ ఉంటుందట. ఇందుకోసమే ఈ సినిమాను పలు విదేశీ లొకేషన్స్‌లో షూట్‌ చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోందని భోగట్టా. గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్, టీ–సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్‌ 25న విడుదల కానుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)