Breaking News

నాటు నాటుకు ఆస్కార్‌ నా వల్లే వచ్చింది: అజయ్‌ దేవగన్‌

Published on Sat, 03/25/2023 - 10:57

ఆర్ఆర్ఆర్ సినిమాకు త‌న వ‌ల్లే ఆస్కార్ వ‌చ్చింద‌ని బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ్‌గన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా నటించిన భోళా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన కపిల్‌ శర్మ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్‌ కపిల్‌ శర్మ నాటు నాటు ఆస్కార్‌ గెలవడంతో అజయ్‌కి శభాకాంక్షలు తెలిపారు.  అనంతరం మీరు న‌టించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి ఆస్కార్ రావ‌డం ఎలా అనిపించింద‌ని క‌పిల్ శ‌ర్మ ప్రశ్నించాడు. 

చదవండి: అప్పట్లోనే సొంత హెలికాప్టర్‌, వేల కోట్ల ఆస్తులు.. నటి విజయ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

దీనికి అజయ్‌ దేవగన్‌ స్పందిస్తూ నిజానికి నాటు నాటుకు ఆస్కార్‌ నా వల్లే వచ్చిందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. అదేలా? అని హోస్ట్‌ అడగ్గా.. ‘అదే నేను నాటు నాటుకు డాన్స్‌ చేసి ఉంటే ఎలా ఉండేది. నా డాన్స్‌ చూసి అకాడెమీ జ్యూరీ మెంబ‌ర్స్ ఆస్కార్ ఇచ్చేవారే కాదు’ అంటూ చమత్కిరించాడు. అజయ్‌ సమాధానం విని అంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. 

చదవండి: నాని ‘దసరా’కు షాకిచ్చిన సెన్సార్‌ బోర్డు, భారీగా కట్స్‌..

దీంతో అజయ్‌ కామెంట్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. షారుఖ్‌ ఖాన్‌ తర్వాత అంతటి సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌ అజయ్‌ దేవగన్‌లోనే ఉంది’, ‘ఒకవేళ అదే పాటకు సన్నీ డియోల్‌ డాన్స్‌ చేసి ఉంటే ఎలా ఉండేది.. ఊహించుకోండి’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌లో అజయ్‌ దేవగన్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌ తండ్రిగా అజయ్‌ కనిపించారు. 


 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)