Breaking News

రాజమౌళి మూవీపై డాక్యుమెంటరీ.. విడుదలపై అధికారిక ప్రకటన!

Published on Mon, 12/09/2024 - 16:08

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ వేదికపై సగర్వంగా తెలుగు సినిమాను నిలిపారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్‌ను సాధించింది. మన సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.

ఆర్ఆర్ఆర్ ఘనవిజయంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌ అనే పేరుతో డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు దర్శకుడు రాజమౌళితో కూడిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే రిలీజ్ తేదీని మాత్రం వెల్లడించలేదు.

కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్‌ వైడ్‌గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్‌ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్‌ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)