Breaking News

ఐపీఎల్‌ RCB ప్రోమోలో రష్మిక.. వీడియో వైరల్‌

Published on Mon, 03/18/2024 - 18:22

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రముఖ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీజన్ 17కు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. 2024 నుంచి ఆర్​సీబీ ఫ్రాంచైజీ తమ జట్టు పేరులో చిన్న మార్పు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం RCB తమ జట్టు పేరును ఇంగ్లీషులో (Royal Challengers Bangalore) అని రాస్తోంది. ఇకపై (Royal Challengers Bengaluru) అని మార్చనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే విషయాన్ని చెబుతూ ఇప్పటికే పలు వీడియోలను RCB విడుదల చేసింది.

తాజాగా రష్మిక మందన్న కూడా ఆర్సీబీ కోసం ఒక ప్రోమోను విడుదల చేసింది. అందులో రష్మిక మందన్న మేకప్ వ్యాన్ లోపలికి వెళ్తుంది. ఆ వ్యాన్ లోపల అద్దంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని రాసి ఉంది. అది చూసిన రష్మిక రాయల్ ఛాలెంజర్స్‌ను మాత్రమే ఉంచి  బెంగళూరు అనే పదాన్ని తుడిచిపెట్టేసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇలాంటి వీడియో ఒకటి రిషబ్ శెట్టి కూడా గతంలో విడుదల చేశారు. 

16 ఏళ్లుగా జట్టు పేరు మార్చాలని అక్కడి స్థానికులు ఆర్‌సీబీని  కోరుతున్నారు. స్థానిక అభిమానుల కోరికమేరకు ఆర్సీబీ ఈ మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 19న చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆర్సీబీ అన్‌బాక్స్‌ ఈవెంట్‌లో పేరు మార్పుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మార్చి 22న CSK, RCB మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్‌-2024 సీజన్‌ ప్రారంభం కానుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)