Breaking News

బబుల్‌గమ్‌ ట్రైలర్‌తో యూత్‌ను టార్గెట్‌ చేసిన రోషన్‌ కనకాల

Published on Fri, 12/15/2023 - 14:54

'బబుల్‌గమ్‌' సినిమాతో వెండితెరపై కనిపించనున్నాడు యాంకర్‌ సుమ కుమారుడు రోషన్‌ కనకాల. ఈ సినిమాలో ఆయనకు జోడీగా  మానస చౌదరి నటిస్తుంది. రవికాంత్‌ పేరెపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

ట్రైలర్‌తో మంచి ఇంపాక్ట్‌ చూపించాడు రోషన్‌ కనకాల. ప్రధానంగా యూత్‌ను టార్గెట్‌ చేసినట్లు ట్రైలర్‌తో అర్థమౌతుంది. ప్రియురాలి వల్లే ప్రియుడికి అవమానం ఎదురైతే ఆ యువకుడి భావోద్వేగాలు ఎలా ఉంటాయో పర్‌ఫెక్ట్‌గా చూపించాడు రోషన్‌. అలాంటి సమయం ఎదురైతే జీవితంలో ఆ యువకుడు ఎలా సక్సెస్‌ అయ్యాడు..? అదే విధంగా ఆమెపై ఎలా రివెంజ్‌ తీర్చుకున్నాడు..? అనే ఆసక్తికర అంశాలతో ట్రైలర్‌ ఉంది.

ఇందులో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది. పాటలకు కూడా శ్రీచరణ్‌ పాకాల అందించిన సంగీతం యువతను మెప్పిస్తుంది. మొదటి సినిమాతోనే రోషన్‌ నటన సూపర్‌ అనిపించేలా ఉంది. యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్న ఈ ట్రైలర్‌ను చూసేయండి.  డిసెంబర్‌ 29న బబుల్‌గమ్‌ విడుదల కానుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)