Breaking News

నటి రోహిణి చిత్రానికి అరుదైన ఘనత..!

Published on Sat, 10/28/2023 - 09:13

లెన్స్‌, మస్కిటో ఫిలాసఫీ, తలైకూత్తల్‌ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు జయప్రకాష్‌ రాధాకృష్ణన్‌ తెరకెక్కించిన చిత్రం కాదల్‌ ఎంబదు పొదువుడమై.  ఈ చిత్రాన్ని ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌ చిత్ర దర్శకుడు జియో బేబీ సమర్పణలో మెన్‌ కైండ్‌ సినిమాస్‌, నితీష్‌ ప్రొడక్షన్స్‌, సిమెట్రీ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.  ఈ చిత్రంలో సీనియర్ నటి రోహిణి కీలకపాత్రలో నటించారు. ఆమెతో పాటు లిజోమోల్‌, వినీత్‌, కలేశ్‌ రామనాథ్‌, అనుష్క, దీప ప్రధాన పాత్రలు పోషించారు.

తాజాగా కాదల్‌ ఎంబదు పొదువుడమై మూవీ 54వ ఇండియన్‌ పనోరమ అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికైనట్లు మేకర్స్ తెలిపారు.  తమిళ చిత్రం కాదల్‌ ఎంబదు పొదువుడమై ఎంపిక కావడం విశేషం. ఈ ఏడాది  నవంబర్‌ 20 నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరగనున్నాయి. 

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఈ ఆధునికకాలంలో మనుషుల భావాలు, దురాలోచనలు, సామాజిక పరిస్థితి, విజ్ఞానం వంటి అంశాలతో కూడిన ఆధునిక ప్రేమను ఆవిష్కరించే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. కాగా 2023 ఏడాదిగానూ ఇండియన్‌ పనోరమ చిత్రోత్సవాలకు 408 చిత్రాలు నామినేట్‌ కాగా.. అందులో 25 చిత్రాలు మాత్రమే ఎంపికై నట్లు చెప్పారు. ఆ 25 చిత్రాల్లో తమ కాదల్‌ ఎంబదు పొదువుడమై చిత్రం చోటుచేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా.. ఈ సినిమాకు కన్నన్‌ నారాయణన్‌ సంగీతమందించగా.. శరవణన్‌ సినిమాటోగ్రఫీ అందించారు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)