Breaking News

మా జీవితంలోకి అమ్మవారు వచ్చిన రోజు.. ఘనంగా కూతురి ఫస్ట్‌ బర్త్‌డే!

Published on Sun, 08/03/2025 - 13:55

కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌- జోర్దార్‌ సుజాత ఇంట సంతోషాల మూట అడుగుపెట్టి ఏడాదవుతోంది. వీరిద్దరూ 2023లో పెళ్లి చేసుకోగా 2024లో కూతురు పుట్టింది. తమ ఇంట్లో సంబరాన్ని, సందడిని తీసుకొచ్చిన గారాలమూటకు ఖ్యాతిక అని నామకరణం చేశారు. ఇటీవలే తన అన్నప్రాసన కూడా జరిగింది. తాజాగా తన మొదటి పుట్టినరోజు ఘనంగా సెలబ్రేట్‌ చేశారు. బంధుమిత్రుల సమక్షంలో ఈ బర్త్‌డే వేడుకలు జరిగాయి. 

హ్యాపీ బర్త్‌డే చిట్టితల్లి
ఈ సెలబ్రేషన్స్‌కు బిగ్‌బాస్‌ బ్యూటీ కీర్తి భట్‌ కూడా వెళ్లింది. హ్యాపీ బర్త్‌డే చిట్టి తల్లి అంటూ అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. జోర్దార్‌ సుజాత సైతం కూతురి గురించి స్పెషల్‌ పోస్ట్‌ పెట్టింది. ఆగస్టు 1.. మా జీవితంలోకి సాక్షాత్తూ అమ్మవారే వచ్చినరోజు. మా ఇంట వెలుగులు నింపిన రోజు.. అమ్మానాన్నలుగా మేము వరం పొందిన రోజు.. నా బంగారుతల్లి పుట్టినరోజు. నా ఖ్యాతికమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసుకున్న రోజు.. అప్పుడే సంవత్సరం కావొస్తుంది. 

కమెడియన్‌గా..
పుట్టినరోజు శుభాకాంక్షలు ఖ్యాతికమ్మా.. మా అదృష్ట దేవతను అద్భుతంగా చూసుకునేలా మమ్మల్ని ఆశీర్వదించండి అని రాసుకొచ్చింది. రాకేశ్‌.. జబర్దస్త్‌ షోతో కమెడియన్‌గా పాపులర్‌ అయ్యాడు. కేసీఆర్‌ సినిమాలో నటించడమే కాకుండా దానికి నిర్మాతగా వ్యవహరించాడు. టీవీలో యాంకర్‌గా పని చేసిన సుజాత జోర్దార్‌ షోతో పాపులారిటీ సంపాదించింది. తెలుగు బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లోనూ పార్టిసిపేట్‌ చేసింది. సేవ్‌ ద టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌లో యాక్ట్‌ చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించింది.

 

 

చదవండి: స్టార్స్‌ రీయూనియన్‌.. జల్సాకు బదులు సేవ చేయొచ్చుగా!

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)