Breaking News

'రాబిన్‍హుడ్' టికెట్‌ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతి

Published on Tue, 03/25/2025 - 11:57

టాలీవుడ్‌ హీరో నితిన్(Nithiin), శ్రీలీల( Sreeleela) జోడీగా నటించిన చిత్రం 'రాబిన్‍హుడ్'(Robinhood).. ఉగాది కానుకగా మార్చి 28న  ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ టికెట్ల ధరలను పంచుతూ ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్  ఈ మూవీని నిర్మించారు. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు.  గతంలో భీష్మ సినిమాతో నితిన్ - వెంకీ కాంబినేషన్‌ సూపర్‌ హిట్‌ అయింది. ఇప్పుడు రాబిన్‌హుడ్‌ కూడా భారీగా క్లిక్‌ అవుతుందని ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.

రాబిన్‌హుడ్‌ చిత్ర మేకర్స్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 28 నుంచి ఏడు రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్‌లో ఒక్కో టికెట్‍పై రూ.50 , మల్టీప్లెక్స్ లలో టికెట్‍కు రూ.75 ధరను అదనంగా పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. జీఎస్టీతో కలిపే ఈ ధరలు ఉంటాయని అందులో పేర్కొంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు.

రేట్లు పెంపు సరే.. తేడా వస్తే..
భారీ బడ్జెట్‌ చిత్రాలకు మాత్రమే గతంలో టికెట్ల రేట్లు పెంపునకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చేవి. అయితే, ఇప్పుడు మీడియమ్‌ బడ్జెట్‌ చిత్రాలకు కూడా ఇలా రేట్లు పెంచడం ఏంటి అంటూ విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి సమయంలో గేమ్‌ ఛేంజర్‌, డాకూమహారాజ్‌, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలకు టికెట్‌ ధరలు పెంచారు. అయితే, ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్లడం బాగా తగ్గిపోయింది. దీంతో వెంటనే ఆ ధరలను మళ్లీ తగ్గించేశారు. ఇప్పుడు రాబిన్‍హుడ్ చిత్రానికి టికెట్ ధరలను పెంచాలనే నిర్ణయం సరైంది కాదని విమర్శలు ఉన్నాయి.  సినిమా బాగుందని టాక్ వస్తే సరే.., ఒకవేళ మిక్స్డ్ టాక్ వస్తే మాత్రం రిస్క్‌ తప్పదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ధరల పెంపు వల్ల థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గే  ఛాన్స్ ఉంది. రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉండకపోవచ్చని చెప్పవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)