Breaking News

హిజ్రాలకూ సభ్యత్వం కల్పిస్తా: ఆర్‌కే సెల్వమణి

Published on Sun, 11/05/2023 - 10:35

మారుతీ ఫిలిమ్స్‌, టచ్‌ స్క్రీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థల అధినేతలు ఎస్‌.రాధాకృష్ణన్‌, ఎస్‌.హరి కలిసి నిర్మిస్తున్న చిత్రం డెవిల్‌. సవరకత్తి చిత్రం ఫేమ్‌ ఆదిత్య కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం ద్వారా దర్శకుడు మిష్కిన్‌ సంగీత దర్శకుడుగా పరిచయం కావడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రంలో ఆయన ఒక పాట పాడి కీలక పాత్రను పోషించారు. కాగా నటుడు విదార్థ్‌, పూర్ణ, ఆదిత్‌ అరుణ్‌, శుభశ్రీ రాయ్‌ గురు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర ఆడియో శుక్రవారం సాయంత్రం చైన్నెలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ముందుగా మిష్కిన్‌ నేతృత్వంలో లైవ్‌ మ్యూజిక్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో దర్శకుడు, పెప్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి, బాల, వెట్రిమారన్‌, నిర్మాత థాను పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

సంగీత దర్శకుడిగా పరిచయం అయిన మిష్కిన్‌ మాట్లాడుతూ కథలన్నీ ఒక కథ నుంచే పుడుతాయన్నారు. అదే విధంగా ఈ డెవిల్‌ చిత్ర కథ అలాంటిదేనని పేర్కొన్నారు. ఒక ప్రశాంతమైన ఇంటిలోకి చీకటి చొరబడుతుందన్నారు. దీంతో ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతుందన్నారు. ఆ తరువాత దాన్నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే ఈ చిత్ర కథ అని చెప్పారు. తనకు కర్ణాటక, హిందుస్తానీ సంగీతాన్ని నేర్పించిన రామమూర్తి తనకు ఒక గురువు కాగా మరొక గురువు ఉన్నారని ఆయనే ఇళయరాజా అని వారి పాదాలకు నమస్కారం చేస్తున్నానని పేర్కొన్నారు.

దర్శకుడు తాను చిన్న వయసు నుంచి చూస్తూ ఆశ్చర్యపడిన దర్శకుడు ఆర్‌కే సెల్వమణి అని, ఆయన ఆరి–2 కెమెరాతో చిత్రాలను చిత్రీకరించినా, పారా విజన్‌లో తీసినట్లు వుంటుందని అన్నారు. ఈ సందర్భంగా తాను ఆయనను ఒక కోరిక కోరుకుంటున్నానని, హిజ్రాలకు కూడా నటులుగా సభ్యత్వం కల్పించాలన్నదే ఆ కోరిక అన్నారు. దీనిపై స్పందించిన ఆర్‌కే సెల్వమణి సినీ పరిశ్రమకు చెందిన ఏ శాఖలో నైనా ఆసక్తి కలిగిన హిజ్రాలు చేరవచ్చునని చెప్పారు. బైలాస్‌లో కూడా ఇందుకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)