Breaking News

నాపై దారుణమైన ట్రోల్స్ చేశారు: స్టార్ హీరోయిన్

Published on Sat, 02/25/2023 - 23:16

నటీనటులకు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం సర్వ సాధారణమైపోయింది. ఇటీవల పలువురు స్టార్ హీరోయిన్లపై దారుణమైన ట్రోల్స్ చేయడం మీరు చూసే ఉంటారు. అలాగే తాజాగా తనకు అలాంటి అనుభవాలు ఎదురైనట్లు నటి వెల్లడించింది. ఆమె పేరే రితిక సింగ్. తెలుగు పెద్దగా పరిచయం లేని పేరు.  2017 సంవత్సరంలో వెంకటేశ్ సరసన గురు సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది భామ. ఆ తర్వాత నీవెవరో, శివలింగ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన ట్రోల్స్‌ తనను ఎంతో బాధించాయని తెలిపింది. వాటితో చాలా ఇబ్బందులు ఎదురైనట్లు వాపోయింది నటి. 

ముంబయిలో జన్మించిన రితిక సింగ్ క్రీడాకారిణి కూడా. ఆమె మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించారు. 2009లో భారత్ తరపున ఆసియా గేమ్స్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత 2012 లో ఇరుదు చుట్రు అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ 2016లో మాధవన్‌తో సాల కడూస్ సినిమాకు మంచి పేరు సంపాదించింది. తాజాగా ఆమె నటించిన కార్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది. 

నా ఫోటోలు దారుణంగా ఎడిట్ చేశారు

రితిక సింగ్ మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ఎంతగానో బాధించాయి. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు నన్ను ఇబ్బంది పెట్టాయి. వాటితో నా గుండె పగిలినంత పనైంది. నాకు కుటుంబం ఉంది. ఇవి చూస్తే వాళ్లు చాలా బాధపడతారు. నేను కోరుకునేది ఒక్కటే ఆడవారిని అందరూ గౌరవించాలి. మిడిల్ క్లాస్ అయినా.. సెలబ్రిటీ అయినా సమానంగా చూడాలి. అమ్మాయిలకు కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి. స్కూల్స్‌లో వారానికి కనీసం ఒక్కసారైనా సెల్ఫ్ డిఫెన్సివ్ క్లాసులు నిర్వహించాలి. నేను చిన్నప్పుడే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. తర్వాత జనరేషన్ పిల్లలకు చాలా త్వరగా సమాజం పట్ల అవగాహన కల‍్పించాలి.' అంటూ తన బాధను వెల్లడించింది. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)