Breaking News

ఇది వారికే అంకితమిస్తున్నా: రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్

Published on Tue, 02/21/2023 - 23:40

ఎలాంటి అంచనాలు లేకుండా పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటిన చిత్రం కాంతార. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం రూ. 16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు రిషబ్‌శెట్టి. అదే సినిమాకుగాను ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ఆయన మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌గా అవార్డు అందుకున్నారు.  తనకు అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రిషబ్‌ సోషల్‌ మీడియాలో ఓ లేఖ పోస్ట్‌ చేశారు. ముంబయిలో సోమవారం ఈ అవార‍్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.

లేఖలో రిషబ్ శెట్టి రాస్తూ.. 'ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడంలేదు.  ‘కాంతార’ అవకాశం ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్‌ నిర్మాణ సంస్థ, నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ సర్‌కు ధన్యవాదాలు. హోంబలే సంస్థతో కలిసి మరిన్ని చిత్రాలకు కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నా. కాంతార భాగమైన చిత్రబృందం, నా జీవిత భాగస్వామి ప్రగతిశెట్టి లేనిదే ఈ అవార్డు లేదు. వారి సహకారంతోనే ఇది సాధ్యమైంది. ఈ అవార్డును కర్ణాటక ప్రజలు, దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌, భగవాన్‌ (దివంగత దర్శకుడు)సర్‌కు అంకితమిస్తున్నా. నన్ను అభిమానించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.' అని రిషబ్‌ పోస్ట్ చేశారు.  ప్రస్తుతం ఈ సినిమా ప్రీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు రిషబ్‌. తదుపరి చిత్రంలో హీరో తండ్రి పాత్రను ప్రధానంగా చూపిస్తారని తెలుస్తోంది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)