Breaking News

నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం

Published on Mon, 04/07/2025 - 19:04

ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ సృష్టించిన సినిమా 'కాంతార'(Kantara Movie) . కేవలం రూ.15 కోట్లతో తీస్తే రూ.400 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుతం దీని ప్రీక్వెల్ తీస్తున్నారు. అక్టోబరు 2న రిలీజ్. అయితే షూటింగ్ విషయంలో ఎప్పటికప్పుడు ఏదో ఓ అడ్డంకి వస్తూనే ఉంది. ఈ క్రమంలో హీరో-డైరెక్టర్ రిషభ్ శెట్టి(Rishab Shetty).. పంజర్లి దేవతని దర్శించాడు.

(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా)

సినిమాలో చూపించినట్లే కర్ణాటకలో పలు ప్రాంతాల్లో నిజంగానే జరుగుతూ ఉంటాయి. తాజాగా మంగళూరులోని పంజుర‍్లి దేవస్థానాన్ని రిషభ్ శెట్టి సందర్శించగా.. షాకింగ్ అనుభవం ఎదురైంది. పంజుర్లి పూనిన పూజరి మాట్లాడుతూ.. 'నీ చుట్టూ చాలామంది శత్రువులు ఉన్నారు. భారీ కుట్రకు తెరతీశారు. కానీ నువ్వు నమ్మిన దేవుడు నిన్ను కచ్చితంగా కాపాడుతాడు' అని చెప్పుకొచ్చారు.

కాంతార తీస్తున్నప్పుడు పెద్దగా ఇబ్బందులు రాలేదు గానీ కొన్నిరోజుల క్రితం బెంగళూరుకి దగ్గర్లో ప్రీక్వెల్ షూటింగ్ చేస్తుండగా.. పర్యావరణానికీ హాని చేస్తున్నారని అటవీశాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. షూటింగ్ టైంలో పేలుడు పదార్థాలు ఉపయోగించారని ఫిర్యాదులు వచ్చాయి. ఓ యాక్సిడెంట్ జరగ్గా.. పలువురు యూనిట్ సభ్యులకు గాయాలయ్యాయి. ఇలా ఏదో ఓ సమస్య వస్తుండటంతోనే తాజాగా పంజుర్లిని రిషభ్ కలిశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

 (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)