Breaking News

'సందర్భం లేకుండా అడగొద్దు.. మీడియాపై ప్రముఖ నటి అసహనం'!

Published on Tue, 08/26/2025 - 21:07

ప్రముఖ మలయాళ నటి రీమా కల్లింగల్ తాజాగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్అవార్డ్ను సొంతం చేసుకుంది. థియేటర్: ది మిత్ ఆఫ్ రియాలిటీ మూవీలో పాత్రకు గానూ ఘనత దక్కించుకుంది. అవార్డ్ అందుకున్న రీమా సినీ ఇండస్ట్రీ, కెరీర్గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను ఒక నటినేనని.. తన ప్రదర్శన గురించి మాట్లాడాల్సిన చోట అమ్మా గురించి ప్రస్తావించడం సరికాదని హితవు పలికింది.

అవార్డ్ ఈవెంట్లో రీమాకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA)లో నాయకత్వ మార్పుపై మాట్లాడాలని ఆమెను అడిగారు. తన అవార్డ్అందుకునే సమయంలో ఇలా అడగడం సరైంది కాదని రీమా అసంతృప్తి వ్యక్తం చేసింది. అమ్మాలో ఎక్కువగా మహిళల ప్రాతినిధ్యం కోసం తన మద్దతును ఉంటుందని తెలిపింది. కానీ ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రశంసను అందుకున్న సమయంలో అమ్మా రాజకీయాల గురించి అడగడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొంది.

రిమా కల్లింగల్ మాట్లాడుతూ..'నా సినిమాలో నటనకు నేను అవార్డు గెలుచుకున్నా. కానీ ఈ సినిమా గురించి ఎటువంటి ప్రశ్నలు మీరు అడగలేదు. నేను మొదట నటిని. అందరూ ఆ విషయం మర్చిపోయినట్లున్నారు' అని అన్నారు. కాగా.. సజిన్ బాబు దర్శకత్వం వహించిన థియేటర్: ది మిత్ ఆఫ్ రియాలిటీ చిత్రం అక్టోబర్ 16 థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. రీమా కల్లింగల్ ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఈ కమిటీలో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పది మంది సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీలో మంజు వారియర్, పార్వతి, రెమ్య నంబీసన్ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు.

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)