దర్శకుడు రాంగోపాల్‌ వర్మపై క్రిమినల్‌ కేసు

Published on Thu, 09/18/2025 - 07:20

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ(ఆర్‌జీవీ)పై రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘దహనం’.. ‌ 2022లో ఏప్రిల్‌ 14న విడుదలైన ఈ మూవీని దర్శకుడు అగస్త్య మంజు తెరకెక్కించారు. అయితే,  ఇందులో ఫ్యూడలిస్టులు, నక్సలైట్లకు మధ్య జరిగే పోరాటాన్ని తెరకెక్కించారు. ఓ కమ్యూనిస్ట్‌ నేత రాములును ఏ విధంగా హత్య చేశారు.. తన  తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న  ఓ కొడుకు కథగా ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మించారు. 

అయితే,  రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి చెప్పిన వాస్తవ ఘటనల ఆధారంగా వెబ్‌ సిరీస్‌ రూపొందించినట్లు ఆర్‌జీవీ చెప్పారని, ఇది అవాస్తవమని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారిణి అంజనా సిన్హా రెండు రోజుల క్రితం రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తాను ఎవరితోనూ వాస్తవ ఘటనలంటూ చెప్పలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత గుర్తింపును దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆమె ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండానే చిత్రంలో ఆమె పేరును ఉపయోగించుకోవడం విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉందని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం తన ప్రతిష్టకు భంగం కలిగించడమేనంటూ ఆమె పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)