Breaking News

కనీసం రూ.100 అయినా ఇవ్వండి.. రేణు దేశాయ్‌ పోస్ట్‌ వైరల్‌

Published on Tue, 10/31/2023 - 17:29

‘బద్రి’చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయింది నటి రేణూ దేశాయ్‌. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత జానీ(2003) చిత్రంలో నటించి, పవన్‌తో ప్రేమలో పడింది. కొన్నాళ్లు డేటింగ్‌ చేసిన తర్వాత 2009లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 2012లో ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతం కొడుకు అకీరా, కూతురు ఆద్యతో కలిసి ఉంటుంది రేణూ. పిల్లల కోసం సినిమాలను దూరం పెట్టింది.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ‘టైగర్‌ నాగేశ్వరరావు’తో  తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె  సంఘ సంస్కర్త హేమలత లవణం పాత్రను పోషించి, తనదైన నటనతో మెప్పించింది. మంచి పాత్రలు లభిస్తే..ఇకపై సినిమాల్లో నటిస్తానని కూడా చెప్పింది. దీంతో టాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శకులు రేణూ దేశాయ్‌కి కథలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా సినిమాల పరంగా కాస్త దూరమైనా.. సోషల్‌ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది రేణూ దేశాయ్‌.  మంచి పనులను చేయడానికే సోషల్‌ మీడియాను వాడుతుంటారు. తాజాగా రేణూ తన ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతుంది. 

నా వంతుగా రూ.30 వేలు ఇచ్చా
రేణూ దేశాయ్‌కి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. తను పెట్స్‌తో పాటు పిల్లులను కూడా పెంచుకుంటుంది. వాటికి ఆరోగ్య సమస్యలు వస్తే.. తట్టుకోలేదు. అంతేకాదు పెంపుడు జంతువుల కోసం విరాళాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ మూడు కుక్కలకు ఆపరేషన్‌ చేయించేందుకు ఓ సంస్థ విరాళాలు అడుగుతోంది. ఆపరేషన్‌కి మొత్తం రూ.55 వేల వరకు ఖర్చు అవుతుందట.

ఈ విషయం రేణూ దేశాయ్‌ దృష్టికి వెళ్లింది. దీంతో తన వంతుగా రూ.30 వేలు విరాళం ఇచ్చి.. మిగతా డబ్బును ఎవరైనా పంపించగలరంటూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ పెట్టింది. ‘నేను రూ.30 వేలు సర్దాను.  దయచేసిన మిగతా డబ్బును ఎవరైనా పంపించగలరు. కనీసం ఒక్కొక్కరు రూ. 100 పంపించినా చాలు’ అని రేణూ దేశాయ్‌ తన ఫాలోవర్స్‌కి విజ్ఞప్తి చేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)