Breaking News

ఆ దర్శకుడికి కలిసొచ్చిన హీరోయిన్.. దక్షిణాదిలోనే భారీ రెమ్యునరేషన్‌!

Published on Sun, 07/16/2023 - 07:46

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం విడుదలై చాలా రోజులైంది. కనెక్ట్‌ చిత్రం తర్వాత నయనతార తెరపై కనిపించలేదు. ఈ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. అదే సమయంలో పారితోషికాన్ని పెంచుకుంటూనే పోతున్నారు.

(ఇది చదవండి: స్టార్‌ హీరోయిన్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక మిమ్మల్ని చూడలేనంటూ!)

ఈ సంచలన భామ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి నటించిన తొలి చిత్రం జవాన్‌. షారుక్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ఇందులో ప్రతినాయకుడిగా నటించారు. ఇక క్రేజీ బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పడుకొనే కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. కాగా కోలీవుడ్‌ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

దర్శకుడు అట్లీకి నటి నయనతార లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి. ఈయన తొలి చిత్రం రాజారాణిలో నయనతారనే కథానాయకి. ఆ తర్వాత విజయ్‌ కథానాయకుడిగా రూపొందించిన బిగిల్‌ చిత్రంలోని ఈమెనే హీరోయిన్. ఈ రెండు చిత్రాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. తాజాగా తన తొలి హిందీ చిత్రంలోను నయనతారనే కథానాయికగా తీసుకున్నారు. ఈ చిత్రంలో ఆమెకు రూ. 8 నుంచి 10 కోట్ల వరకు పారితోషికం ముట్ట జెప్పినట్లు సమాచారం. బాలీవుడ్‌ హీరోయిన్లతో పోస్తే ఇది తక్కువే అయినా దక్షిణాది హీరోయిన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. కాగా జవాన్ తన తొలి హిందీ చిత్రం కావడంతో రిజల్ట్‌ కోసం లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

(ఇది చదవండి: జబర్దస్త్‌ అవినాష్‌ తల్లికి గుండెపోటు! స్టంట్స్‌ వేసిన వైద్యులు )

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)