Breaking News

అప్పుడు విలన్ ఇప్పుడు హీరోయిన్

Published on Tue, 07/07/2026 - 08:23

స్టార్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌.. ఇప్పుడు హీరో, నిర్మాతగానూ రాణిస్తున్నాడు. ఈయన లీడ్ రోల్ చేసిన 'డీసీ' ఈ నెల చివరలోనే రిలీజ్ రానుంది. జీ స్క్వాడ్‌ పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించి యంగ్ డైరెక్టర్లతో పలు చిత్రాల్ని తీస్తున్నాడు. ఈయన నిర్మిస్తున్న 'బెంజ్', 'ఫైట్‌ క్లబ్‌' నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి విశాల్‌ వెంకట్‌ దర్శకుడు.

విశాల్ వెంకట్ ఇంతకు ముందు సిరి నేరంగలిల్‌ సిల మనిదర్గళ్‌, బాంబ్‌ వంటి వైవిధ్య భరితమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈయన ఇప్పుడు మహిళా నేపథ్య కథాచిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో రెజీనాని హీరోయిన్‌‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో తమిళంలో అజిత్‌ 'విడాముయర్చి'లో రెజీనా విలన్‌గా చేసింది. చిన్న గ్యాప్‌ తర్వాత మళ్లీ ఇప్పుడు దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ నిర్మాణంలో నటించనుంది.

విశేషం ఏమిటంటే లోకేష్‌ కనకరాజ్‌ తొలి మూవీ 'మానగరం'లో రెజీనానే హీరోయినే. తాజాగా రూపొందనున్న చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా పాన్‌ ఇండియా మూవీతో బిజీగా ఉన్నాడు. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)