Breaking News

ఆ ఐదు కోరికలు తీరకుండానే కన్నుమూసిన కృష్ణంరాజు

Published on Mon, 09/12/2022 - 09:58

కృష్ణంరాజు టైటిల్‌ రోల్‌లో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘భక్త కన్నప్ప’ చిత్రానికి అమితమైన ప్రేక్షకాదరణ లభించింది. ఈ సినిమాను ప్రభాస్‌తో రీమేక్‌ చేయాలని కృష్ణంరాజు ఆశపడ్డారు.. కానీ కుదర్లేదు. అలాగే ప్రభాస్‌ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ (2005) సినిమాలోని ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌లో ‘ఒక్క అడుగు’ అనే పదం ఉంటుంది. దీన్నే టైటిల్‌గా పెట్టి, ఓ మల్టీస్టారర్‌ సినిమాను తన దర్శకత్వంలోనే చేయాలనుకున్నారు కృష్ణంరాజు. అయితే ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. అలాగే ‘విశాల నేత్రాలు, జీవన తరంగాలు’ నవలలంటే ఆయనకు ఇష్టం. వీటి ఆధారంగా సినిమాలు తీయాలనుకున్నారు. అదీ నెరవేరలేదు.

ఇక ప్రభాస్‌ పెళ్లి చూడాలని కృష్ణంరాజు ఎంతగానో ఆశపడ్డారు. కానీ ప్రభాస్‌కు ఉన్న వరుస సినిమాల కమిట్‌మెంట్స్‌ కారణంగా వివాహం వాయిదా పడుతూ వస్తోంది. అలాగే తన ముగ్గురు కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తిల వివాహాల విషయంలోనూ కృష్ణంరాజుకి ఆశ ఉండటం సహజం. మరోవైపు ఎంపీ అయిన కృష్ణంరాజుకు గవర్నర్‌ హోదాలో బాధ్యతలు నిర్వర్తించాలని ఉండేదట. ఓ దశలో కృష్ణంరాజుకు తమిళనాడు గవర్నర్‌ పదవి అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. 

యంగ్‌ రెబల్‌ స్టార్‌తో మూడు చిత్రాలు
కృష్ణంరాజు–ప్రభాస్‌ కాంబినేషన్‌లో మూడు సినిమాలు వచ్చాయి. పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి ప్రభాస్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న తొలి సినిమా ‘బిల్లా’ (2009). ఈ సినిమా వచ్చిన మూడేళ్లకు ‘రెబల్‌’ (2012) సినిమాలో కలిసి నటించారు కృష్ణంరాజు, ప్రభాస్‌. ‘రెబల్‌’ తర్వాత మరోసారి కృష్ణంరాజు, ప్రభాస్‌ కలిసి నటించడానికి పదేళ్లు పట్టింది. ప్రభాస్‌ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్‌’ (2022)లో పరమహంస అనే కీ రోల్‌ చేశారు కృష్ణంరాజు. ఇది ఆయనకు చివరి సినిమా.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

సుమోలు, కేరళాలు.. గుడ్ ఫ్రెండ్స్ ఏందయ్యా ఈ బ్రాండ్లు..!

రెడ్ బుక్ రాజ్యాంగంలో 390 మంది హత్యకు గురయ్యారు

అందాల యుద్ధం

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక

Photos

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)