Breaking News

బీజేపీ సపోర్ట్‌.. అయినా నో రిలీజ్‌.. ‘అరి’కష్టాలు

Published on Sun, 04/06/2025 - 13:05

సినిమా పరిశ్రమ అనేది ఒక వింతైన ప్రపంచం. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని సినిమాలు ఇలా షూటింగ్‌ని ప్రారంభించి..అలా థియేటర్స్‌లోకి వచ్చేస్తాయి. మరికొన్ని చిత్రాలు మాత్రం ఏళ్ల తరబడి ల్యాబ్‌కే పరిమితం అవుతుంటాయి. అయితే వీటిల్లో కొన్ని చిత్రాలు సరైన కంటెంట్‌ లేక ఆగిపోతే..మరికొన్ని మాత్రం డిఫరెంట్‌ కంటెంట్‌, ఎవరూ టచ్‌ చేయలేని, ట్రెండింగ్‌ పాయింట్‌ ఉన్నప్పటికీ విడుదలకు నోచుకోవు. ఈ కోవలోకి చెందిన చిత్రమే ‘అరి’ (Ari Movie). ‘పేపర్‌ బాయ్‌’తో సూపర్‌ హిట్‌  అందుకున్న  జయశంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయి దాదాపు రెండేళ్లు కావోస్తోంది. 

వాస్తవానికి ఈ సినిమా కంటే ముందు గీతా ఆర్ట్స్‌లో జయశంకర్‌ ఓ సినిమా చేయాల్సింది. స్క్రిప్ట్‌తో పాటు ప్రీప్రొడక్షన్‌ పనులు కూడా షూరు అయ్యాయి. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఆ సినిమా ముందుకు వెళ్లలేదు. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకొని కొత్త నిర్మాతలతో కలిసి ‘అరి’ సినిమాను తెరకెక్కించాడు. ఇంతవరకు ఎవరు టచ్‌ చేయని  అరిషడ్వర్గాలపై స్టోరీ రాసుకున్నాడు. వినోద్‌ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ లాంటి అగ్ర తారాగణంతో సినిమాను రిచ్‌గా తెరకెక్కించాడు.

గతేడాదిలోనే ఈ సినిమా రిలీజ్‌ కావాల్సింది. ఈ మేరకు ప్రమోషన్స్‌ కూడా మొదలు పెట్టారు. టీజర్‌, ట్రైలర్‌తో పాటు మంగ్లీ ఆలపించిన కృష్ణుడి సాంగ్‌ని కూడా రిలీజ్‌ చేశారు. ప్రచార చిత్రాలన్నింటికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంతి కిషన్‌రెడ్డి సైతం ఈ సినిమాకు సపోర్ట్‌గా నిలిచారు.

వెంకయ్య నాయుడు,‘ఇస్కాన్‌’ ప్రముఖులు, చిన్న జీయర్‌ స్వామితో పాటు పలు హిందు సంఘాలు  ఈ సినిమా చూసి చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ఇదంతా ఏడాది క్రితం జరిగిన విషయం. అదే సమయంలో సినిమా రిలీజ్‌ చేసి ఉంటే.. సినిమాకు వచ్చిన బజ్‌ ఎంతో కొంత ఉపయోగపడేది. కారణం ఏంటో కానీ అప్పుడు సినిమా రిలీజ్‌ కాలేదు.

ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ని మళ్లీ స్టార్ట్‌ చేశారు. నిన్న ‘కల్కి’ డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌తో ఈ సినిమా  థీమ్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేయించారు. 'భగ భగ..' అంటూ సాగే ఈ పాటకు కూడా ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఈ సారి కూడా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించలేదు మేకర్స్‌. ప్రచార చిత్రాలకు మంచి స్పందన రావడంతో పాటు బీజేపీ అగ్రనాయకుల సపోర్ట్‌ ఉన్నప్పటికీ సినిమా ఎందుకు విడుదల కావడంలేదో తెలియదు. ఇలాంటి డిఫరెంట్‌ కంటెంట్‌ ఉన్న సినిమాలను త్వరగా రిలీజ్‌ చేసుకుంటేనే మంచిది. ఆలస్యం అయ్యేకొద్ది కంటెంట్‌ పాతదై రొటీన్‌ చిత్రంగా మారే అవకాశం ఉంటుంది. కొత్త నిర్మాతలకు ఈ విషయం తెలియాదా? లేదా తెలిసినా విడుదల విషయాన్ని లైట్‌ తీసుకుంటున్నారా? ఏదేమైనా ఆలస్యం అమృతం విషం.
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)