రీల్స్ చేయను క్షమించండి..
Breaking News
అయ్యప్ప దీక్షలో రవితేజ.. కొత్త సినిమా టైటిల్ ఇదే
Published on Mon, 01/26/2026 - 10:45
రవితేజ పుట్టినరోజు సందర్భంగా నేడు (జనవరి 26) కొత్త సినిమాతో పాటు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. క్రేజీ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఇరుముడి(Irumudi) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. స్వామియే శరణం అయ్యప్పా అంటూ తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో అయ్యప్పమాల ధరించి రవితేజ ఉన్నారు. చేతిలో మరో చిన్నారిని ఎత్తుకుని ఆయన కనిపించారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అంతా తండ్రీకూతుళ్ల బంధం గురించి ఉండనుందిని టాక్.. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే ఒక తండ్రిగా రవితేజ కనిపిస్తారని తెలుస్తోంది.

దర్శకుడు శివ నిర్వాణ గతంలో నిన్ను కోరి (2017), మజిలీ (2019), ఖుషి (2023) వంటి ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. రవితేజ కోసం కాస్త రూట్ మార్చి ఓ థ్రిల్లర్ కథతో రానున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో 2026లోనే ఈ మూవీ విడుదల కానుంది.
Tags : 1